మధ్య ప్రదేశ్‌కు చెందిన జూనియర్ ఆర్చర్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మూడు వెండి పతకాల్ని, ఒక రజతాన్ని సాధించారు. ఇవి సాధించడానికి ముందు వారికో పెద్ద ప్రమాదం ఎదురైంది.
దెహ్రాదూన్‌లో జరిగే ఆర్చర్ పోటీలలో పాల్గొనడానికి ఎనిమిది మంది జూనియర్ ఆర్చర్స్.. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు. కొంత సమయం తర్వాత వారు ప్రయాణిస్తున్న బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో వారు పక్కనున్న బోగీలోకి దూకారు. అయితే వారు వెంట తెచ్చుకున్న క్రీడా వస్తువులు, ఆధార్ కార్డ్ తదితర వస్తువులన్నీ కాలిపోయాయి. ఈ ఘటన శనివారం జరిగింది.
"ఆదివారం ఉదయం ఒంటిగంటకు వారు దెహ్రాదూన్ చేరకున్నారు. అయితే వారి దగ్గర సాధన చేయడానికి క్రీడా వస్తువులు లేవు. మరో గంటలోపు క్రీడా వస్తువుల్ని పంపిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాచారం ఇచ్చాయి. దాంతో క్రీడా వస్తువులు వచ్చేలోపు నిద్రపొమ్మని ఆర్చర్స్‌ను కోరాను. క్రీడా వస్తువులు అందాయి. మరో మూడు గంటల్లో పోటీ జరుగుతుందనగా వారు ప్రాక్టీసు మొదలెట్టారు. తర్వాత జరిగిన పోటీలో జూనియర్ ఆర్చర్లు సోనియా ఠాకూర్, అమిత్ కుమార్ నాలుగు పతకాలు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు."
-రిచ్‌పాల్ సింగ్, మధ్యప్రదేశ్ ఆర్చరీ హెడ్ కోచ్
వ్యక్తిగతంగా జరిగిన పోటీలో సోనియా వెండి పతకాన్ని గెలుచుకుంది. ఇంకో రౌండ్ గెలిస్తే ఒలింపిక్స్‌కు అర్హత సాధించేది. హరియాణా ప్రత్యర్థితో జరిగిన మాచ్ డ్రాగా ముగియడం వల్ల ఒలింపిక్స్ అవకాశం కోల్పోయింది. రజత పతకంతో సరిపెట్టుకుంది.
మిక్స్డ్ డబుల్స్‌లో అమిత్‌తో కలసి మరో వెండి పతకాన్ని సాధించింది సోనియా.
వ్యక్తిగతంగా జరిగిన పోటీలో అమిత్‌కుమార్ రజతాన్ని, సోనియాతో కలిసి ఆడిన మిక్స్డ్ డబుల్స్‌లో వెండి పతకాన్ని గెలుచుకున్నాడు.
ఇదీ చదవండి: రాణించిన మిథాలీ.. సౌతాఫ్రికా లక్ష్యం 189