ETV Bharat / sports

French Open 2022: జకోవిచ్​కు షాక్.. ఫ్రెంచ్‌ ఓపెన్‌కూ కష్టమే!

French Open 2022: వ్యాక్సినేషన్​కు సంబంధించి సరైన ఆధారాలు చూపని కారణంగా సెర్భియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్​కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్​ ఓపెన్​లోనూ అతడు ఆడటం అనుమానంగా మారింది.

djokovic
జకోవిచ్
author img

By

Published : Jan 18, 2022, 8:34 AM IST

French Open 2022: రెండు డోసుల టీకా వేసుకోని కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమైన ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌.. ఈ ఏడాదిలో రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఆడడం అనుమానంగా మారింది. ఫ్రాన్స్‌లోని కొత్త చట్టమే అందుకే కారణం. ఆదివారం అక్కడి పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం ప్రకారం.. క్రీడా స్టేడియాలు, రెస్టారెంట్ల లాంటి బహిరంగ ప్రదేశాల్లో టీకా వేసుకున్నట్లు టీకా ధ్రువీకరణ పత్రం ఉన్నవాళ్లనే అనుమతిస్తారు.

"కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత టీకా వేసుకున్న వాళ్లకే బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశం ఉంటుంది. అది ఎవరైనా సరే. ఓ ప్రేక్షకుడైనా లేదా ఓ క్రీడాకారుడైనా.. అందరికీ ఒకటే నిబంధన. అందుకు ఎవరికీ మినహాయింపు ఉండదు" అని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది. ఆ దేశ ఎంపీ క్రిస్టోఫె కాస్టనర్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.

మే చివర్లో ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ కోసం మొదట పటిష్ఠమైన బయో బబుల్‌ను ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు టీకా వేసుకున్న వాళ్లనే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం ఆ దేశం వెళ్లిన జకోవిచ్‌.. రెండు డోసుల టీకా వేసుకోని నేపథ్యంలో వీసా రద్దుతో స్వదేశం బాట పట్టాడు. ఆస్ట్రేలియా నుంచి విమానంలో దుబాయ్‌ చేరుకున్న అతను.. అక్కడి నుంచి సెర్బియాకు మరో విమానంలో వెళ్లాడు.

ఇదీ చదవండి:

'జకోవిచ్​ ఉన్నా లేకపోయినా ఆస్ట్రేలియన్​ ఓపెనే ముఖ్యం!'​

వీసా రద్దు.. ఆస్ట్రేలియన్ ఓపెన్​ నుంచి జకోవిచ్ ఔట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.