ETV Bharat / sports

నాదల్​కు షాక్​.. ఆ కుర్రాడి చేతిలో ఘోర పరాజయం - us open Frances

యూఎస్​ ఓపెన్​లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్​కు నిరాశ ఎదురైంది. అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టోయాఫే చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యాడు.

us open nadal
యూఎస్​ ఓపెన్ నాదల్​
author img

By

Published : Sep 6, 2022, 10:37 AM IST

ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ 2022లో సెమీస్​కు ముందే గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. తన ఆశలన్నీ యూఎస్ ఓపెన్‌పైనే పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడతడకి నిరాశే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్​ ఓపెన్​లో నాలుగో రౌండ్​లో అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టోయాఫే చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యాడు. పురుషుల్ సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు సెట్లలో మూడింటిని సొంతం చేసుకుని అద్భుత విజయాన్ని అందుకున్నాడు ఫ్రాన్సిస్.

ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్సీస్.. నాదల్‌ను 6-4. 4-6, 6-4 6-3 తేడాతో ఓడించి విజయాన్ని సాధించాడు. 24 ఏళ్ల అమెరికన్ ప్లేయర్ రఫా పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కాగా, ఈ మ్యాచ్​లో మొదటి సెట్‌ను కోల్పోయిన నాదల్.. రెండో సెట్‌లో పుంజుకుని అందులో గెలిచాడు. అయితే తర్వాత జరిగిన రెండు సెట్లలోనూ ఓటమి పాలయ్యాడు. ఫలితంగా మ్యాచ్ చేజార్చుకున్నాడు.

గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌ను ఓడించిన అమెరికా క్రీడాకారుల్లో ఫ్రాన్సిస్ టోయాఫే మూడో ఆటగాడు. అంతకుముందు ఆండీ రొడ్డిక్, జేమ్స్ బ్లేక్ రఫాను ఓడించారు. ఫ్రాన్సీస్ ఈ విజయంతో రొడ్డిక్ తర్వాత యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదీ చూడండి: విజయ్​ దళపతి వర్సెస్​ ఇండియా పాక్​ మ్యాచ్‌.. ఈ రెండింటికి లింక్​ ఏంటబ్బా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.