Formula 1 Champion 2021: ఈ ఏడాది ఫార్ములావన్(ఎఫ్-1) ఆఖరి ఘట్టంలో విజయం సాధించి కొత్త ఛాంపియన్‌గా నిలిచాడు రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్. ఈ సీజన్లో చివరిదైన అబుదాబి గ్రాండ్ ప్రిలో గెలిచిన ఇతడు.. నెదర్లాండ్స్ తరఫున తొలిసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.
అబుదాబి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో ఏడుసార్లు ఛాంపియన్ హామిల్టన్‌ను వెనక్కి నెట్టి పోల్ పొజిషన్‌ను చేజిక్కించుకున్న వెర్‌స్టాపెన్.. తుది రేసులోనూ అదే జోరు కొనసాగించాడు.
శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో వెర్‌స్టాపెన్ 1 నిమిషం 22.109 సెకన్లలో అగ్రస్థానంలో నిలవగా హామిల్టన్ (1 నిమిషం 22.480 సెకన్లు) రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
ఇదీ చదవండి: