అంతర్జాతీయ మ్యాచ్లకు ముందు ఇరు దేశాల జాతీయపతాకాన్ని ఎగరేస్తూ.. వారి జాతీయగీతాన్ని ఆలపిస్తుంటారు క్రీడాకారులు. ఇందుకు తగినట్లుగానే ఆటగాళ్లు జెండావైపు చూస్తూ గౌరవపూర్వకంగా నిల్చొంటారు. అయితే ఫ్రెంచ్ బాస్కెట్బాల్ మాజీ ప్లేయర్ గ్వెర్చాన్.. జాతీయపతాకం వైపు చూడకుండా తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అతడికి దాదాపు లక్ష రూపాయల(1400 డాలర్లు) జరిమానా విధించింది చైనా.
చైనాలోని నాన్జింగ్ టాంగ్సీ మంకీ కింగ్ జట్టుకు చెందిన గ్వెర్చాన్ యబుసెలెకు ఈ శిక్ష విధించింది చైనీస్ బాస్కెట్ బాల్ అసోసియేషన్(సీబీఏ). ఇటీవల జరిగిన ఓ మ్యాచ్కు ముందు చైనా జాతీయగీతాలాపన జరుగుతోంది. ఆ సమయంలో యబుసెలె చైనా జాతీయపతాకాన్ని చూడకుండా కిందకు చూస్తున్నాడు.
-
Guerschon Yabusele is fined by Chinese Basketball Association for ¥10k ($1.42k) for not saluting the Chinese national flag during the national anthem ahead of the game against Zhejiang Golden Bulls. It is a courtesy that one should comply with persuant to the league handbook. pic.twitter.com/8e9za2oLs5
— Titan Sports Plus (@titan_plus) December 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Guerschon Yabusele is fined by Chinese Basketball Association for ¥10k ($1.42k) for not saluting the Chinese national flag during the national anthem ahead of the game against Zhejiang Golden Bulls. It is a courtesy that one should comply with persuant to the league handbook. pic.twitter.com/8e9za2oLs5
— Titan Sports Plus (@titan_plus) December 7, 2019Guerschon Yabusele is fined by Chinese Basketball Association for ¥10k ($1.42k) for not saluting the Chinese national flag during the national anthem ahead of the game against Zhejiang Golden Bulls. It is a courtesy that one should comply with persuant to the league handbook. pic.twitter.com/8e9za2oLs5
— Titan Sports Plus (@titan_plus) December 7, 2019
ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సీబీఏ అతడికి సీరియస్ వారింగ్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా 10,000యువాన్ల(రూ.లక్ష) జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్గా మారింది. చైనా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
జరిమానా అంశంపై యబుసెలె ఇంతవరకు స్పందించలేదు. అతడు ఈ ఏడాదే సీబీఏతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకుముందు బోస్టన్ సెల్టిక్స్ ఫ్రాంఛైజీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపోదించాలని ఉద్దేశంతో జాతీయగీతాన్ని అవమానపరిచేలా ఎవరైన ప్రవర్తిస్తే వారిని శిక్షించేలా 2017లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నిబంధన తీసుకొచ్చారు. ఉల్లంఘించిన వారికి 3ఏళ్ల జైలు శిక్ష విధించేలా శాసనం చేశారు.
ఇదీ చదవండి: శాగ్ క్రీడల్లో భారత్ నవశకం.. అత్యధిక పతకాలతో రికార్డు