ఫిట్నెస్ ద్వారా ప్రతి ఒక్కరి మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయని తెలిపారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు. జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని స్పోర్ట్స్ కౌన్సిల్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో.. 'ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'ను మంత్రి ప్రారంభించారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటే గొప్ప అనుభూతిగా ఉంటుందని పేర్కొన్నారు.
"ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా శ్రీనగర్‌లోని 5,400 అడుగుల ఎత్తున్న కొండపైకి పరుగు ప్రారంభించాను. ఎక్కడైనా, ఎప్పుడైనా.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటే గొప్ప అనుభూతిని పొందవచ్చు! ప్రతి ఒక్కరి మానసిక, శారీరక సమస్యలకు ఫిట్నెస్ మాత్రమే పరిష్కారం. రోజూ అరగంట ఫిట్నెస్ కోసం కేటాయిస్తే మేలు" అని మంత్రి ట్వీట్ చేశారు.
-
#FitIndiaMovement today morning in Srinagar running uphill at an altitude of 5,400 feet.
— Kiren Rijiju (@KirenRijiju) April 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Anywhere & anytime let's maintain a better body to feel great! Fitness is the solution to all physical & mental problems. 'Fitness Ka Dose Aadha Ghanta Roz' #NewIndiaFitIndia pic.twitter.com/ukOQ9svZ4F
">#FitIndiaMovement today morning in Srinagar running uphill at an altitude of 5,400 feet.
— Kiren Rijiju (@KirenRijiju) April 11, 2021
Anywhere & anytime let's maintain a better body to feel great! Fitness is the solution to all physical & mental problems. 'Fitness Ka Dose Aadha Ghanta Roz' #NewIndiaFitIndia pic.twitter.com/ukOQ9svZ4F#FitIndiaMovement today morning in Srinagar running uphill at an altitude of 5,400 feet.
— Kiren Rijiju (@KirenRijiju) April 11, 2021
Anywhere & anytime let's maintain a better body to feel great! Fitness is the solution to all physical & mental problems. 'Fitness Ka Dose Aadha Ghanta Roz' #NewIndiaFitIndia pic.twitter.com/ukOQ9svZ4F
ఇదీ చదవండి: మనీష్ వల్లే సన్‌రైజర్స్ ఓడిపోయింది!: సెహ్వాగ్
శ్రీనగర్ దాల్ సరస్సు సమీపంలోని నెహ్రూ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) మనోజ్ సిన్హా, ఎల్జీ సలహాదారు ఫరూక్ ఖాన్, జమ్ముకశ్మీర్ యూత్ సర్వీసెస్ కార్యదర్శి అలోక్ కుమార్ పాల్గొన్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. అత్యాధునిక వాటర్ స్పోర్ట్స్ సదుపాయాల్ని కేటాయిస్తామని ఈ ఏడాది ఆరంభంలో మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి నిధులు కూడా కేటాయించారు.
ఈ కొత్త ఖేలో ఇండియా సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి చాలా ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. యువ క్రీడాకారులకు ఇది శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'విలయమ్సన్‌కు ఇంకా సమయం పడుతుంది'