స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ)లో అవినీతి జరుగుతోందని స్టార్ రెజ్లర్, సంస్థ అధ్యక్షుడు సుశీల్ కుమార్ ఆరోపించాడు. ఇదే సంస్థ సెక్రటరీ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని చట్టాలను మార్చినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తమ సంస్థలో మోసం జరిగినట్లు క్రీడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సుశీల్ చెప్పాడు. "అవకతవకలను సరిదిద్ది, మార్పు చేసిన చట్టాలను సవరించి, డిసెంబరు చివరి నాటికి సెక్రటరీ పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా క్రీడా మంత్రి నాతో చెప్పారు" అని సుశీల్ వెల్లడించాడు.
ఇదీ చూడండి : ఒలింపిక్స్లో స్వర్ణమే నా లక్ష్యం: సుశీల్