ETV Bharat / sports

ఫ్యాన్​ అతి తెలివి.. బైనాక్యుల‌ర్స్‌లో బీర్​.. అడ్డంగా బుక్కైయాడుగా! - బైనాక్యుల‌ర్స్‌లో బీర్​ పోలీసులకు చిక్కిన ఫ్యాన్

ఫిఫా ప్రపంచకప్​లో ఓ అభిమాని అతి తెలివి ప్రదర్శించి పోలీసులకు దొరికిపోయాడు. బైనాక్యుల‌ర్స్‌లో స్టేడియానికి మద్యం తెచ్చుకుని సేవించబోయాడు.

Binoculars beer fifa worldcup
ఫ్యాన్​ అతి తెలివి.. బైనాక్యుల‌ర్స్‌లో బీర్​.. అడ్డంగా బుక్కైయాడుగా
author img

By

Published : Nov 25, 2022, 5:48 PM IST

ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడాన్ని నిషేధించారు. అయితే మైదానానికి కొంత దూరంలో బయట అమ్ముకునేందుకు వీలు కల్పించారు. దీనిని ఆసరాగా తీసుకున్న అభిమానులు తమ సొంత తెలివి తేటలను ఉపయోగించి స్టేడియంలోకి మద్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సాధారణంగానే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటే కాస్త ఉద్రిక్తత ఉంటుంది. ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందనే కుతూహలంతో ఫ్యాన్స్​ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో కాస్త ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తుంటారు. అందుకే ఈ సారి ప్రపంచకప్​లో మైదానానికి మద్యం తెచ్చుకునే విధానాన్ని, అలాగే ఆ చుట్టూ అమ్మడాన్ని నిషేధించారు. అయితే కొందరు దొంగచాటుగా పోలీసులు, సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం స్టేడియం లోపలికి తీసుకురావాలని చూసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఓ అభిమాని కూడా అతి తెలివి ప్రదర్శించాడు. త‌న బైనాక్యుల‌ర్స్‌లో బీర్‌ను తీసుకెళ్లి అందరిని షాక్‌కు గురి చేశాడు. చెకింగ్ స‌మ‌యంలో సెక్యూర్టీ గార్డ్ ఆ బైనాక్యుల‌ర్స్ లెన్స్ తీశాడు.

అయితే ఆ బైనాక్యుల‌ర్‌లో ద్రవం రూపంలో ఏదో ఉన్నట్లు గుర్తించాడు. శానిటైజర్ తీసుకెళ్తున్నట్లు సదరు అభిమాని చెప్పినప్పటికి అధికారులు వినలేదు. ఆ తర్వాత బైన్యాక్యులర్స్‌లో ఉన్న ద్రవాన్ని వాసన చూడగా అది అల్కాహాల్‌ అని తేలడం వల్ల ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి: టీమ్​ఇండియా న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్​ చిత్రాలు చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.