ETV Bharat / sports

స్టార్​ షట్లర్​ భార్యపై నెటిజన్​ కామెంట్​.. ఎమోషనల్​ అయిన సానియా మీర్జా! - ఆస్ట్రేలియా ఓపెన్ సానియా లాస్ట్ గ్రాండ్​ స్లామ్

ఇండియా స్టార్ షట్లర్​ బోపన్న భార్యపై ఓ నెటిజన్​ కామెంట్​ చేశాడు. దానికి అదే రీతిలో బోపన్న సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా ఓపెన్​ మిక్స్​డ్ డబుల్స్​ కేటగిరీ ఫైనల్స్​లో బోపన్న, సానియా ద్వయం రన్నరప్​గా నిలిచింది. ఈ మ్యాచ్​లోనే ఈ ఘటన జరిగింది.

comments on bopanna wife
comments on bopanna wife
author img

By

Published : Jan 29, 2023, 1:55 PM IST

Updated : Jan 29, 2023, 5:37 PM IST

భారత స్టార్​ షట్లర్లు బోపన్న, సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్​లో మిక్స్​డ్ డబుల్స్​ కేటగిరీలో ఫైనల్​ సమరంలో బ్రెజిల్​ ప్లేయర్లు లూసా స్టెఫానీ, రఫాల్​ మాటోస్​తో తలపడ్డారు. వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఓడిపోయారు. ఇక సానియా మీర్జా తన జీవితంలో చివరి గ్రాండ్​ స్లామ్​ మ్యాచ్​ ఆడింది. ఈ మ్యాచ్​కు బోపన్న భార్య, పిల్లలు కూడా వచ్చారు. సానియా కుటుంబం కూడా వచ్చింది. కాగా, మ్యాచ్​ అనంతరం బోపన్న భార్యపై ఓ నెటిజన్​ కామెంట్​ చేశాడు. దానికి బోపన్న కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చాడు.
బోపన్న భార్య ఫొటోను సోషల్​ మీడియాలో ఓ నెటిజన్ పోస్ట్​ చేశాడు. దానికి "బోపన్న భార్య.. నేను ఇప్పటివరకు చూడని అత్యంత అందమైన మహిళ " అని రాసుకొచ్చాడు. దీనిపై బోపన్న స్పందిస్తూ.." నేను ఏకీభవిస్తున్నాను.. " అని రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. లక్కీ మ్యాన్​ అని ఓ నెటిజన్​ కామెంట్​ చేయగా.. మరికొందరు ఇద్దరికీ కంగ్రాట్స్​ తెలిపారు.

comments on bopanna wife
బోపన్న రిప్లై

ఎమోషనల్​ అయిన సానియా మీర్జా..
రన్నరప్​తో తన గ్రాండ్​ స్లామ్​ కెరీర్​​ను ముగించింది సానియా మీర్జా. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఒకవేళ నేను ఏడుస్తుంటే.. అవి ఆనందబాష్పాలు మాత్రమే. నేను ఇంకో రెండు టోర్నమెంట్లు ఆడతాను. నా ప్రొఫెషనల్​ కెరీర్ మెల్​బోర్న్​లోనే మొదలైంది' అని భాగోద్వేగానికి గురైంది. 'నేను 14 ఏళ్ల వయసులో నేషనల్స్​కు ఆడేటప్పుడు రోహన్​ బోపన్న నా మొదటి పార్టనర్. ఇది 22 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ నాకు రోహన్​ కంటే బెస్ట్​ పార్టనర్​ దొరకలేదు. అతడు నా బెస్ట్ ఫ్రెండ్.' అని బోపన్నకు సానియా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఇటీవలే రిటైర్మెంట్​ ప్రకటించింది 36 ఏళ్ల సానియా మీర్జా. ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ(వరల్డ్​ టెన్నిస్​ అసోషియేషన్) ఈవెంట్​లో తన ఆఖరి మ్యాచ్​ ఆడనుంది. ఇప్పటివరకు ఈ షట్లర్​.. మూడు మిక్స్​డ్​ డబుల్స్​తో సహా 6 గ్రాండ్​ స్లామ్​ టైటిళ్లను సాధించింది.

bopanna with wife
భార్యతో బోపన్న

Last Updated : Jan 29, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.