ETV Bharat / sports

మరినాతో పోరుకు సిద్ధం.. నా గెలుపు తథ్యం: మిచెల్లీ - వాటర్​సన్, రోడ్రిగేజ్

యూఎఫ్​సీ మహిళల విభాగం ఫ్లై వెయిట్ కేటగిరీలో ఆసక్తిపోరుకు రంగం సిద్ధమైంది. మరినా రోడ్రిగేజ్​తో 9వ ర్యాంకర్ మిచెల్లీ వాటర్​సన్​ పోటీపడనుంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ముచ్చటించిన వాటర్​సన్ పలు విషయాలు పంచుకుంది.

Marina
వాటర్​సన్
author img

By

Published : May 7, 2021, 12:36 PM IST

Updated : May 7, 2021, 1:51 PM IST

యూఎఫ్​సీ (అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్​షిప్).. ఓ అమెరికన్ మిక్స్​డ్ మార్షల్ ఆర్ట్స్​కు సంబంధించిన టోర్నీ. ప్రీమియన్ వరల్డ్ స్పోర్ట్​గా ప్రస్తుతం చలామణి అవుతోంది. ఇందులో ప్రపంచస్థాయి బాక్సర్లు తలపడతారు. పురుషులతో పాటు మహిళలు తమ సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తాజాగా మే 9న యూఎఫ్​సీ ఫ్లై వెయిట్ విభాగంలో ఆసక్తికర పోరు జరగనుంది. 'కరాటే హాటీ'గా గుర్తింపు పొందిన మాజీ మోడల్, స్ట్రా వెయిట్ 9వ ర్యాంకర్​ మిచెల్లీ వాటర్​సన్​తో 6వ ర్యాంకర్ మరినా రోడ్రిగేజ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ముచ్చటించిన వాటర్​సన్​ పలు విషయాలు పంచుకుంది.

యూఎఫ్​సీ మెయిన్ ఈవెంట్​లో మీరు మరినా రోడ్రిగేజ్​తో తలపడనున్నారు. ఈ పోటీ కోసం ఏ విధంగా సన్నద్ధమయ్యారు?

ఇంతకుముందులాగే ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు చాలా శ్రమిస్తున్నా. ఇందుకోసం నేను ఆల్బుక్వెర్క్​లో శిక్షణ తీసుకుంటున్నా. నా కదలికల్ని మెరుగుపరుచుకోవడానికి నా స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ చాలా సాయం చేశారు. నా వరకు అత్యుత్తమ పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. మొదటి రౌండ్​లోనే తనని చిత్తుచేసినా.. లేక మ్యాచ్ ఐదు రౌండ్ల వరకు వెళ్లినా ఆమెను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా.

Marina
వాటర్​సన్

అమండా రిబాస్, రోస్ నమజునాస్ వంటి గొప్ప ఫైటర్స్​తో మీరు తలపడ్డారు. ఇందులో ఎవరితో మళ్లీ పోటీ కోసం ఎదురుచూస్తున్నారు?

ఏంజెలా హిల్​తో జరిగిన పోటీ చాలా గొప్పగా అనిపించింది. చివరి నిమిషం వరకు జరిగిన ఈ మ్యాచ్​ను బాగా ఆస్వాదించా. ఐదు రౌండ్లు జరిగిన ఈ పోటీలో పైచేయి సాధించడం నాలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. రోస్​తో పోరు మజాగా ఉంటుంది. ఈమెతో మళ్లీ తలపడాలని అనుకుంటున్నా.

మాకు తెలిసి ఈ ఫైట్ ఫ్లైవెయిట్ కేటగిరీలో బుక్ అయింది. ఇందుకోసం మీ గేమ్ ప్లాన్​ని ఏమైనా మార్చుకున్నారా?

ఇందులో పెద్దగా తేడా ఏమీ ఉండదు. నాకు మొదటి నుంచి ఐదు రౌండ్ల వరకు ప్రత్యర్థిపై పైచేయి సాధించగల సత్తా ఉంది. ఈ పోటీ కోసం ఎదురుచూస్తున్నా. మొదటి రౌండ్​లోనే తనని చిత్తుచేసినా.. లేక మ్యాచ్ ఐదు రౌండ్ల వరకు వెళ్లినా ఆమెను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా.

మరినా రోడ్రిగేజ్​తో పోటీ ఎలా ఉండబోతుంది?

మరినా చాలా ప్రమాదకర ప్రతర్థి. ఆమె సాధించిన రికార్డులే ఇందుకు నిదర్శనం. ఈ విభాగంలో అందరికంటే పొడగరి. చాలా బలవంతురాలు. కుడి చేతి పంచ్ కూడా చాలా బలంగా ఉంటుంది. నేను స్టాండింగ్​లో ఉన్నా గ్రౌండ్ గేమ్​ ఆడినా తనను ఎదుర్కొనే సత్తా ఉంది. తన కంటే నా రెజ్లింగ్ టెక్నిక్ చాలా బాగుంటుంది.

ప్రత్యక్ష ప్రసారం, సమయం

ఈ పోటీ మే 9న ఉదయం 5.30 గంటలకు ప్రసారమవుతుంది. సోనీ టెన్ 2, సోనీ టెన్ 3 ఛానెల్స్​లో వీక్షించవచ్చు.

Last Updated : May 7, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.