ETV Bharat / sports

'ఈ విజయం మాలో మరింత స్ఫూర్తి నింపింది' - chess dronavalli harila exclusive interviews

చెస్​ ఒలింపియాడ్​లో భారత్​ స్వర్ణం సాధించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. తొలిసారిగా ఆన్​లైన్​లో నిర్వహించిన ఈ టోర్నీలో రష్యాతో హోరాహోరీగా తలపడింది భారత జట్టు. సాంకేతిక సమస్యలతో నిర్వాహకులు రెండు దేశాలను విజేతలుగా ప్రకటించారు. భారత్​ తరఫున పాల్గొన్న 12 మందిలో ఒకరైన ద్రోణవల్లి హారిక.. ఈ విజయాన్ని ఈటీవీ భారత్​తో పంచుకుంది.

Dronavalli Harika
ద్రోణవల్లి హారిక
author img

By

Published : Sep 1, 2020, 6:19 PM IST

Updated : Sep 1, 2020, 6:45 PM IST

చదరంగం టోర్నీల్లో ఒలింపిక్స్​లా భావించే ప్రతిష్ఠాత్మక చెస్ ఒలంపియాడ్​లో భారత్ స్వర్ణంతో మెరిసింది. రెండేళ్లకోసారి అంతర్జాతీయ చెస్ సమాఖ్య-ఫిడే నిర్వహించే టోర్నీ కొవిడ్ నేపథ్యంలో ఈసారి ఆన్ లైన్ లో నిర్వహించారు. ఫైనల్​లో రష్యాతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్​లో.. సర్వర్​ సమస్యలు, భారత జట్టు ఆధిపత్య ఆటతీరుతో.. వినూత్నంగా రష్యాతో కలిసి సంయుక్తంగా భారత జట్టుకు ఫిడే స్వర్ణం ప్రకటించింది. పన్నెండు మంది సభ్యులు పాల్గొన్న టీమ్​ఇండియాలో తెలుగుతేజాలు కోనేరుహంపి, ద్రోణవల్లి హారిక, పెంటల హరికృష్ణ భాగం కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఈ సందర్భంగా చదరంగం క్రీడలో ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్​లో స్వర్ణం గెలవటం పట్ల.. జట్టులో భాగస్వామి అయిన చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక ఈటీవీతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే విందాం రండి.

ద్రోణవల్లి హారిక ఇంటర్వ్యూ

ప్ర. 2014 కాంస్యం తర్వాత..ఇప్పుడు బంగారు పతకం గెలవడం, సక్సెస్​కు కారణమైన జట్టులో మీరు భాగస్వామి అవడం ఎటువంటి అనుభూతినిచ్చింది ?

జ. మరిచిపోలేని అనుభూతి. నా కెరీర్​లో ఇది మైలురాయి వంటిది. ఈ టోర్నీలో ఎన్నో ఏళ్లుగా మెడల్ కోసం ప్రయత్నిస్తున్నాం. రెండేళ్లకోసారి వచ్చే టోర్నీ.. ఈసారి ఆన్ లైన్ వేదికగా జరగటం కొత్త అనుభవాన్నిచ్చింది. అప్ కమింగ్ ప్లేయర్స్​కు ఇదొక మంచి అవకాశం. బంగారు పతకం గెలిచిన జట్టులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

ప్ర. రష్యా, పొలాండ్, చైనా వంటి బలమైన జట్లతో పాటు.. 163 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో పోటీ ఎలా ఉంది?

Dronavalli Harika
ద్రోణవల్లి హారిక

జ. 163 దేశాలు పాల్గొన్న టోర్నీ అంటేనే ఎంత కష్టతరమో అర్థం చేసుకోవచ్చు. పాత ఒలింపిక్ ర్యాంక్​ని బట్టి మేము టాప్ సీడ్​లో ఆడాం. మా పూల్​లో చైనాతో తలబడి గెలిచి క్వార్టర్ ఫైనల్స్​కు వెళ్లడం చాలా కీలకమైనదిగా చెప్పొచ్చు. చైనా వంటి గట్టి జట్లతో గెలవడం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. టోర్నీలో అదే స్ఫూర్తితో ముందుకెళ్లాం.

ప్ర. చదరంగంలో ముఖాముఖి తలపడటానికి, ఇలా ఆన్ లైన్​లో పోటీ పడటానికి మీరు గమనించిన తేడాలేంటి?

జ. చాలా తేడా ఉంది. ఆన్ ది స్క్రీన్ చూస్తూ ఆడటం వల్ల చాలా అలసిపోయాం. ఒక రకంగా ఇది టైరింగ్ జర్నీలా అనిపించింది . బోర్డ్​పై ఆడటం అనుభవం ఉన్న మాకు.. మౌస్​తో ఆడటం పూర్తిగా భిన్నమైన అనుభూతి. చెస్​లో సమయంతో పోటీ పడాలి. మాకు ఇలా ఆడటం అనుభవం లేకున్నా.. రోజువారీ ప్రాక్టీస్ ద్వారా అధిగమించాం.

ప్ర. అంతర్జాతీయ టోర్నీలోనూ అంతర్జాల సమస్యలు, సర్వర్ ఇబ్బందులు తలెత్తడాన్ని ఎలా చూస్తారు. ఫైనల్లో ఆ కారణంగా జట్టు ఎదుర్కొన్న ఉత్కంఠ ఎటువంటింది?

జ. పూల్ స్టేజ్​లో ఉన్నప్పుడు అంతర్జాలానికి అంతరాయం కలిగి గెలవాల్సిన మ్యాచ్ డ్రా అయింది. అప్పటినుంచి పూల్ డివిజన్ ముగిశాక అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. నిర్వాహకులతో ఇంటర్నెట్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం జరగకుండా అధికారులకు విజ్ఞప్తి చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. వాళ్లు కూడా బాగా సహకరించారు. అర్మేనియాతో ఆడేటప్పుడు ఒక బోర్డు డిస్​ కనెక్ట్ అయింది. చివర్లో రష్యాతో ఆడేట్పపుడు మొదటి రౌండ్ డ్రాగా ముగిసింది. రెండో రౌండ్ దేశవ్యాప్తంగా అంతర్జాల సమస్యలతో టీం లాస్ అయింది. సమయం కోల్పోవాల్సి వచ్చింది. ఇంటర్నెట్ సమస్య కారణంగా తలెత్తిన ఇబ్బందులతో ఫిడేకు పిర్యాదు చేశాం. మూడు రౌండ్​లలో సరిసమానంగా పోటాపోటీ ప్రదర్శన ఉండటం వల్ల.. మా కష్టాన్ని గుర్తించి ఫిడే రష్యాతో కలిపి సంయుక్తంగా విజేతలుగా ప్రకటించింది.

Dronavalli Harika
ద్రోణవల్లి హారిక

ప్ర. మీతో పాటు.. తెలుగుతేజాలు పెంటల హరికృష్ణ, కోనేరు హంపి ఈ టోర్నీలో ప్రాతినిథ్యం వహించటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఈ టోర్నీ ఆసాంతం మీ జట్టు స్ఫూర్తి ఏవిధంగా కొనసాగింది?.

జ. ఎన్నో ఏళ్లుగా మేం భారత్​కు ఆడుతున్నాం. తెలుగువారిగా దేశానికి ఆడటం ఎప్పడూ గర్వకారణమే. నేను, హంపి,, హరికృష్ణ జైత్రయాత్ర భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం.

ప్ర. టోర్నీలో మీ ఆటతీరు, జర్నీ ఎలా సాగింది. ?

జ. టోర్నీలో నేను 12 గేమ్స్ ఆడాను. మొత్తం 12 పాయింట్లకు గాను 8 పాయింట్లు సాధించాను. దీన్ని వ్యక్తిగతంగా కంటే జట్టు విజయంగానే చూస్తా. విజయంలో నావంతు పాత్ర నేను పోషించా. ఒక్కొక్కరు ఒక్కో రౌండ్​లో రాణిస్తూ ఒక జట్టుగా విజయం పొందటం సంతోషాన్నిచ్చింది.

ప్ర. అంతర్జాతీయ చెస్ ‍ఒలింపియాడ్ టోర్నీలో జూనియర్స్ అద్భుతంగా రాణించారు. నిహాల్, ప్రజ్ఞానంద్, దివ్య తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఫ్యూచర్ చెస్ ఛాంపియన్స్​గా వీరిని చూసే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి ?

జ. జూనియర్స్​కు ఇదొక అద్భుత అవకాశం. ఈ మోటీవేషన్, అనుభవం వారి కెరీర్​లో చాలా మార్పులు తీసుకొస్తుంది. నేను జూనియర్ దశ నుంచే ఈ స్థాయికి చేరుకున్నా. 2004 లో నా మొదటి చెస్ ఒలింపియాడ్ ఆడా. జూనియర్స్ రాణించటం.. చాలా ఆనందదాయకం. ఈ ఫార్మాట్​లో అందరూ బాగా కృషి చేశారు.

ప్ర. అన్​లాక్ ప్రక్రియ నేపథ్యంలో టోర్నీల నిర్వహణ సమీప భవిష్యత్తులో ఏవిధంగా ఉండే అవకాశం ఉంది. అందుకు మీరు ఎలా సన్నద్ధమవుతున్నారు.?

జ.యూరప్​లో పదిమందితో కూడిన క్లోస్డ్ ఈవెంట్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంకా భారత్​లో అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ కూడా అధికారికంగా క్రీడలను ప్రారంభించడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దాన్ని బట్టి మా సన్నద్ధత ఎల్లవేళలా ఉంటుంది.

Dronavalli Harika
ద్రోణవల్లి హారిక

ప్ర. నేషన్స్ కప్ ఓటమి నుంచి ఈ టోర్నీ విజయం దిశగా జట్టును ఎలా మెరుగుపరుచుకున్నారు ?

జ. దేనికదే ప్రత్యేకం. ఒలింపియాడ్ ఎప్పటికీ స్పెషల్. ఇది మాలో మరింత స్ఫూర్తినిస్తుంది. ఒలింపియాడ్ మెడల్ గెలవడం ప్రతి ఒక్క చెస్ క్రీడాకారుడి స్వప్నం. ఆ పట్టుదలతోనే ఇప్పుడు మా కల నెరవేర్చుకున్నాం.

ప్ర. ప్రతిష్టాత్మక ఈ ఈవెంట్​కు మీరు ఇంటినుంచి ప్రాతినిథ్యం వహించారు. ఈ క్రమంలో మీ కుటుంబసభ్యులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు ?

జ. ఇంట్లో నుంచి ఆడినా ప్రాముఖ్యం ఒక్కటే. డిస్ట్రాక్షన్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నా. సౌండ్ పొల్యూషన్ లేకుండా, ఇంటర్నెట్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడ్డా. నా భర్త, కుటుంబసభ్యులు ఈ క్రమంలో మద్దతుగా నిలబడ్డారు. ఇంటి నుంచి ఆడటం అంత సులభం కాదు. టోర్నమెంట్​లో ఉండే సీరియస్​​నెస్ ఉండదు. కానీ ఏకాగ్రత కోల్పోకుండా దృష్టి సారించటం ముఖ్యం. ఈవెంట్ ఆసాంతం అందరి మద్దతుతో విజయం సాధించాం.

Last Updated : Sep 1, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.