ETV Bharat / sports

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో మొక్కలు నాటిన ద్రోణవల్లి హారిక

ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి విసిరిన సవాల్​ను స్వీకరించి.. మాదాపూర్​లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

author img

By

Published : Jul 31, 2020, 4:01 PM IST

dronavalli harika in green india challange
గ్రీని ఇండియా ఛాలెంజ్​లో మొక్కలు నాటిన ద్రోణవల్లి హారిక

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక.. హైదరాబాద్ మాదాపూర్​లోని తన నివాసంలో మొక్కలు నాటారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి మొక్కలు నాటి.. చేసిన సవాల్​ను హారిక స్వీకరించి మూడు మొక్కలు నాటారు. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్​కుమార్​కు హారిక ధన్యవాదాలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు పరమావధిగా సాగుతున్న ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హారిక విజ్ఞప్తి చేశారు. అనంతరం బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు, టెన్నిస్ క్రీడాకారిణి నిధి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుమీత్​ రెడ్డిలకు మొక్కలు నాటమని ద్రోణవల్లి హారిక ఛాలెంజ్ విసిరారు.

ఇదీ చూడండి: భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.