Djokovic Australian Open: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సమర్పించిన ధ్రువపత్రాల్లో తప్పు జరిగిందని టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ చెప్పాడు. జకోవిచ్.. ఆస్ట్రేలియాకు వచ్చే 14 రోజులు ముందు వరకు ఎక్కడికైనా ప్రయాణించాడా? అన్న ప్రశ్నకు.. తన సహాయ సిబ్బందిలోని కొందరు సభ్యులు.. పొరపాటున 'నో' అని ఎంట్రీ ఇచ్చారని అన్నాడు.
తనకు కొవిడ్-19 వచ్చిందని తెలిసి కూడా జకోవిచ్.. ఓ ఇంటర్వూతో పాటు బెల్గ్రేడ్లో ఓ టెన్నిస్ కార్యక్రమంలో పాల్గొన్నాడని మీడియాలో వస్తున్న కథనాలపైనా వివరణ ఇచ్చాడు.
"టెన్నిస్ కార్యక్రమంలో పాల్గొనే సమయానికి నా కొవిడ్ పరీక్ష రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ సమయంలో నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. అయితే నేను ఇంటర్వ్యూ, టెన్నిస్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు క్షమాపణలు చెబుతున్నా" అని జకోవిచ్ పేర్కొన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఏమైందంటే?
ఈ సెర్బియన్ ఆటగాడు గతవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేనందున అతడి వీసాను రద్దు చేయడం సహా అతడిని ఇమ్మిగ్రేషన్ నియంత్రణలోకి తీసుకుని ప్రత్యేక హోటల్‌కు తరలించింది.
ఈ నేపథ్యంలోనే న్యాయపోరాటం చేసిన జకోవిచ్.. ఈ కేసులో గెలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు అతడి వద్ద వైద్యపరమైన మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, దీంతో అతడి వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంటోని కెల్లీ ఆదేశాలిచ్చారు.
ఈ క్రమంలోనే జకోవిచ్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఇక పదోసారి ఆస్ట్రేలియన్ టైటిల్ కైవసం చేసుకొని తన కెరీర్‌లో 21వ గ్రాండ్ స్లామ్ సాధించాలని ఆసక్తిగా ఉన్నాడు.
ఇవీ చూడండి: కరోనా సోకిన మరునాడే టోర్నీలో.. జకోవిచ్ తీరుపై విమర్శలు