ETV Bharat / sports

ధోనీ ముఖ్య అతిథిగా భారత​ ఆర్చర్ల పెళ్లి - dhoni is the chief guest for deepakumari marriage

ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్‌ల పెళ్లికి ముఖ్య అతిథిగా టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ హాజరు కానున్నాడు. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు.

Deepika Kumari
దీపికా కుమారి, అతాను దాస్‌
author img

By

Published : Jun 25, 2020, 11:57 AM IST

భారత ప్రముఖ విలువిద్య క్రీడాకారులు దీపికా కుమారి, అతాను దాస్​ల పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈనెల 30న జరగనున్న కార్యక్రమానికి పలువురు ప్రముఖలు హాజరు కానున్నారు. టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ కుటుంబసమేతంగా రానున్నాడు. స్వయంగా దీపికా, ఆమె తండ్రి పెళ్లి పత్రికను అందించి మహీని ఆహ్వానించారు.

dhoni
ధోని

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​, గవర్నర్​ ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అర్జున్​ ముండా, మాజీ ముఖ్యమంత్రి సుడేష్​ మెహతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులందరినీ దీపికా ఆహ్వానించింది. కరోనా జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించనున్నారు.

అయితే ఈ పెళ్లి వేడుక తొలుత రాంచీలోని దొరండా గ్రామంలోని ఓ అతిథి గృహంలో చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల మొరాబడిలోని వ్రిన్​ధావన్​ బ్యాంకెట్​​ హాలుకు వేదికను మార్చారు.

దీపికా కుమారి, అతాను దాస్‌కు 2018 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికే వీరిద్దరూ టోక్యో ఒలింపిక్స్​ మిక్స్​డ్​ ఆర్చరీ విభాగంలో అర్హత సాధించారు. టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడిన నేపథ్యంలో, తమ పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రాక్టీసుపై దృష్టి పెడతామని అన్నారు.

ఇది చూడండి : '1983 ప్రపంచకప్' మధుర క్షణాలకు 37 ఏళ్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.