ETV Bharat / sports

IND vs WI: ధావన్‌ కెప్టెన్సీలో విండీస్‌తో వన్డే సిరీస్​.. ​కెరీర్​లో అత్యుత్తమ ర్యాంక్​లో పంత్​ - rishabh pant career top rank in test

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ధావన్‌ కెప్టెన్సీలో విండీస్​తో తలపడనుంది. ఇదిలా ఉండగా.. ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో రిషభ్​ పంత్ తన కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​కు ​చేరుకున్నాడు. ​

Dhawan to lead India in away ODI series against West Indies; Rohit, Kohli among those rested
ధావన్‌ కెప్టెన్సీలో విండీస్‌తో వన్డే సిరీస్​.. ​కెరీర్​లో అత్యుత్తమ ర్యాంక్​లో పంత్​
author img

By

Published : Jul 6, 2022, 5:08 PM IST

వెస్టిండీస్‌-భారత్ వన్డే సిరీస్‌ ఈ నెల 22న ప్రారంభం కానుంది. దీంతో 16 మంది సభ్యులతో కూడిన జట్టును భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్​గా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రవీంద్ర జడేజాకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన దీపక్‌ హుడాను విండీస్​తో జరగబోయే మ్యాచ్​లకు ఎంపిక చేశారు. మూడు మ్యాచ్​ల సరీస్​కు రోహిత్​ శర్మ, కోహ్లీ, పంత్​, బూమ్రా, హార్దిక్​ పాండ్యాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దీంతో సంజూ శాంసన్‌కు మరోసారి అవకాశం దక్కగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నాురు. ఇదివరకు శ్రీలంకతో జరిగిన సిరీస్​కు కూడా శిఖర్‌ ధావన్‌ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. జూలై 22- మొదటి వన్డే, జూలై 24- రెండో వన్డే, జూలై 27- మూడో వన్డే జరగనుంది. వన్డేలకు తర్వాత..వెస్టిండీస్‌తో భారత్​ జట్టు టీ20 సిరీస్​ ఆడనుంది.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

ఐదోస్థానంలో పంత్​..
ICC Test rankings: ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో రిషభ్​ పంత్​ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన 5వ టెస్టులో సెంచరీ చేయడం వల్ల.. తన కెరీర్​లో అత్యుత్తమ ర్యాంకు​ 5వ స్థానానికి చేరుకున్నారు.

న్యూజిలాండ్, భార‌త్ జ‌ట్ల‌తో జ‌రిగిన టెస్టుల్లో సత్తా చాటిన జో రూట్ మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్న‌స్ ల‌బుషేన్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఉన్నారు. ఇప్పటివరకు టాప్​లో పాకిస్థాన్​ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ నాలుగో స్థానంతో స‌రి పెట్టుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ ఆరో స్థానం, ఉస్మాన్ ఖ‌వాజా ఏడో ప్లేస్, 8వ స్థానంలో శ్రీ‌లంక‌కు చెందిన దిముత్ క‌రుణ ర‌త్నె , 9వ స్థానంలో భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, 10వ స్థానంలో జానీ బెయిర్ స్టో నిలిచారు.

ఇదీ చదవండి: పీవీ సింధు, సాయి ప్రణీత్​ శుభారంభం.. రెండో రౌండ్​కు అర్హత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.