ETV Bharat / sports

పీటీ ఉష రికార్డు బద్దలు.. 200 మీటర్ల ఫైనల్లో ధనలక్ష్మి

author img

By

Published : Mar 19, 2021, 7:19 AM IST

ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్​లో తమిళనాడు అథ్లెట్ ధనలక్ష్మి రికార్డు సృష్టించింది. 200 మీటర్ల సెమీఫైనల్లో హిమదాస్​ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 1998లో దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష నెలకొల్పిన మీట్ రికార్డును తిరగరాసింది.

Dhanalakshmi
ధనలక్ష్మి

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌లో తమిళనాడు అథ్లెట్‌ ధనలక్ష్మి జోరు కొనసాగుతోంది. మహిళల 100 మీటర్ల ఫైనల్లో జాతీయ ఛాంపియన్‌ ద్యుతిచంద్‌కు షాకిచ్చిన ఆమె.. తాజాగా 200 మీటర్ల సెమీఫైనల్‌ హీట్స్‌లో రికార్డు పరుగుతో మరో స్టార్‌ హిమదాస్‌కు వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

గురువారం జరిగిన ఈ రేసులో ధనలక్ష్మి 23.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆమె 1998లో దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష (23.80 సె) నెలకొల్పిన మీట్‌ రికార్డును బద్దలు కొట్టింది. హిమదాస్‌ (24.39 సెకన్లు) రెండో స్థానంలో నిలిచింది. ఏడాది తర్వాత మళ్లీ బరిలో దిగిన హెప్టాథ్లాన్‌ స్టార్‌ స్వప్నా బర్మన్‌ సత్తాచాటింది. ఆమె 5636 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.