ETV Bharat / sports

సుశీల్​ బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

భారత స్టార్ రెజ్లర్​ సుశీల్ కుమార్​కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్​ను న్యాయస్థానం తిరస్కరించింది.

sushil, wrestler
సుశీల్ కుమార్, భారత రెజ్లర్
author img

By

Published : May 18, 2021, 5:06 PM IST

Updated : May 18, 2021, 5:45 PM IST

భారత ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్​కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్​ను తిరస్కరించింది న్యాయస్థానం.

మే 4న దిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం పరిధిలో జరిగిన గొడవలో సాగర్ రానా అనే వ్యక్తి​ మృతి చెందాడు. ఈ హత్య కేసులో సుశీల్​తో పాటు మరో ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో భాగంగా సుశీల్​పై హత్య, అపహరణ, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. హత్య జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న సుశీల్​.. మే 17న ముందస్తు బెయిల్ పిటిషన్​ కోరుతూ రోహిణి కోర్టును ఆశ్రయించాడు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని వ్యాజ్యంలో పేర్కొన్నాడు. అయినా కోర్టు అతడి అభ్యర్థనకు అంగీకరించలేదు.

ఇదీ చదవండి: కరోనాతో మరో టీమ్​ఇండియా క్రికెటర్​ తల్లి మృతి

Last Updated : May 18, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.