భారత యువరెజ్లర్ దీపక్ పునియా(86 కిలోల విభాగం).. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ నుంచి వైదొలిగాడు. గాయం ఇబ్బంది పెడుతోందని స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. రజతంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరగాల్సిన తుదిపోరులో ఇరాన్‌కు చెందిన హజ్సన్ యజ్దానితో తలపడాల్సి ఉంది. కానీ తను ఆడే పరిస్థితుల్లో లేనని చెప్పాడు.
"స్వర్ణం కోసం ఫైట్ చేయలేకపోవడం బాధగా ఉంది. టోక్యో ఒలింపిక్స్ పతకంపైనే ఇక నా గురి. నా ఎడమ పాదం నొప్పిగా ఉండటం వల్ల, ఈ స్థితిలో ఆడటం కష్టమైంది. నాకు తెలుసు ఇది చాలా మంచి అవకాశమని, కానీ నేనేం చేయలేకపోయాను" -దీపక్, భారత రెజ్లర్
సెమీస్‌లో స్టెఫన్ రీచ్ముత్తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు దీపక్. అయినప్పటికీ ఆ పోరులో 8-2 తేడాతో విజయం సాధించాడు. గతేడాది జూనియర్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్‌ను దక్కించుకున్నాడీ రెజ్లర్. భారత్ తరఫున సుశీల్ కుమార్(2010- 66 కిలోల విభాగం) మాత్రమే ఈ టోర్నీలో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
ఇవీ చదవండి: