46 వ ఏట పతకం సాధించడమంటే మాటలా!. అదీ ఒలింపిక్స్‌లో. కానీ భారత అథ్లెట్ దీపా మాలిక్‌కు (deepa malik biography) ఆ పని చేసి చూపించింది. పతకం సాధించాలనే ఆమె పట్టుదల ముందు వయసు ఓడిపోయింది. 2016 రియోలోని సమ్మర్ పారాలింపిక్స్ షాట్‌పుట్ విభాగంలో దీప రజతం (2016 paralympic medalist) సాధించింది. ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి మహిళ (deepa malik age) ఈమెనే కావడం విశేషం. ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం కూడా ఈ ప్లేయర్ అందుకుంది.
36 ఏళ్లకు మళ్లీ ఆటల్లోకి..
హరియాణాలోని భైస్వాల్‌లో జన్మించింది దీపా మాలిక్. చిన్ననాటి నుంచే ఆమెకు సాహోసోపేత క్రీడలంటే ఇష్టం. 1999లో వెన్నెముకలో చిన్న గడ్డ ఏర్పడటం వల్ల ఆసుపత్రి పాలైంది. ఫలితంగా వెనుకభాగంలో మూడు సర్జరీలు (deepa malik disability) చేసి 183 కుట్లు వేశారు. అప్పట్నుంచి వీల్‌చైర్‌కే పరిమితమైంది. కాటరింగ్ వ్యాపారం చూసుకుంటూ జీవితం వెళ్లదీయసాగింది. ఎట్టకేలకు 36వ ఏట మళ్లీ ఆటల్లో అడుగుపెట్టింది. విభిన్న క్రీడా రంగాల్లో సత్తా చాటుతూ భారత్‌లో ఉత్తమ పారా అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది.
ఆమె ఓ స్ఫూర్తి..
దీపా మాలిక్.. భారతదేశం గర్వించదగ్గ పారా అథ్లెట్లలో ఒకరు. స్విమ్మింగ్, జావలిన్ త్రో, షాట్‌పుట్, క్రికెట్, డిస్కస్ త్రో వంటి పలు రంగాల్లో ప్రావీణ్యం ఆమె సొంతం. వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో 54, అంతర్జాతీయ వేదికలపై 13 బంగారు పతకాలు (2016 paralympic medalist) సాధించింది. నాలుగుసార్లు లిమ్కా బుక్ రికార్డుల్లో పేరు సంపాదించింది. అందుకే ఈ క్రీడాకారిణి ప్రతిభ గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.