ఇటీవల కరోనా బారిన పడిన దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్.. మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన కుమారుడు ఏస్ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ స్పష్టం చేశాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
"ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాము. నిన్నటి నుంచి ఏమీ తినట్లేదు. నీరసంగా ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉంటే మేలని భావించి ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్పించాం" అని జీవ్ మిల్కా సింగ్ తెలిపాడు.
మే 20న మిల్కా సింగ్‌కు కొవిడ్ నిర్ధరణ అయింది. అప్పటి నుంచి చంఢీగడ్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
ఇదీ చదవండి: అథ్లెట్ మిల్కా సింగ్‌కు కరోనా పాజిటివ్