కరోనా దెబ్బకు పలు క్రీడలతో పాటు టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ పోటీల నిర్వహణ తేదీలు ముందుకు జరగడం వల్ల 2021లో జరగాల్సిన కామన్వెల్త్ యూత్ క్రీడలపై దెబ్బ పడింది. దీంతో వాటిని మరో రెండేళ్లు వాయిదా వేశారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
"2021 కామన్వెల్త్ యూత్ క్రీడల నిర్వహణ తేదీల్ని మార్చాలని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ అదే ఏడాది జరగనున్నాయి. దీంతో ప్రత్నామ్యయాలపై దృష్టి పెట్టాం. కామన్వెల్త్ యూత్ గేమ్స్‌ను 2023లో జరపాలని భావిస్తున్నాం" -కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటన
షెడ్యూల్ ప్రకారం ఏడో కామన్వెల్త్ యూత్ క్రీడలు.. ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా 2021 ఆగస్టు 1-7 మధ్య జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు వాటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.