న్యూదిల్లీలో జరిగే ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో చైనా బృందం పాల్గొనే అవకాశం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా వారికి వీసాలు ఇవ్వబోమని చెప్పారు. ఫలితంగా చైనాకు చెందిన 40 మంది రెజ్లర్లు ఈ పోటీల్లో పాల్గొనట్లేదు.
అయితే పాకిస్థాన్‌కు చెందిన రెజ్లర్లు మాత్రం ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నెల 18 నుంచి 24 వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనడానికి పాక్ రెజ్లర్లకు ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. ఫలితంగా పుల్వామా దాడి తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న తొలి పాకిస్థాన్ క్రీడా జట్టుగా ఈ రెజ్లింగ్ బృందం నిలవనుంది.