తెలుగమ్మాయి బొడ్డా ప్రత్యూష.. మహిళా గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించింది. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన జిబ్రాల్టర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఈమెకు మూడో మహిళా గ్రాండ్ మాస్టర్ నార్మ్ లభించింది.
మూడేళ్ల క్రితం తొలి రెండు నార్మ్‌లు సాధించిన ప్రత్యూష.. తాజాగా జిబ్రాల్టర్ టోర్నీలో తొమ్మిది రౌండ్లలో 5 పాయింట్లు సంపాదించి మూడో నార్మ్ అందుకోవడం ద్వారా ఈ హోదా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే మహిళా గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించారు. భారత్‌లో ఈ హోదా ఉన్న ఎనిమిదో క్రీడాకారిణి ప్రత్యూష. ఇప్పటిదాకా ఎనిమిది జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలు గెలిచిన ప్రత్యూష.. జిబ్రాల్టర్ టోర్నీలో 25 పాయింట్లు సాధించి మొత్తం మీద ఎలో పాయింట్ల సంఖ్యను 2325కు పెంచుకుంది.
గతేడాది జాతీయ సీనియర్ చెస్‌లో నాలుగో స్థానం సాధించిన ప్రత్యూష.. బీజింగ్ చెస్ టోర్నీలో అయిదో స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: 'బిగిల్' భామకు గ్లామర్ పాత్రలంటే నచ్చదంట..!