ETV Bharat / sports

టోక్యో టికెట్టు కోసం 13 మంది బాక్సర్ల పోరు

జోర్డాన్‌ వేదికగా నేటి నుంచి ఆసియా ఒలింపిక్స్​ బాక్సింగ్​ క్వాలిఫయర్స్​ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భారత్​ నుంచి ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రీడల్లో సెమీస్ చేరిన ఆటగాళ్లకు టోక్యో బెర్త్​ సొంతం కానుంది.

Boxing's Asian Olympic Qualifiers: Amit gets top billing, Mary Kom 2nd seeded
టోక్యో బెర్త్​ వేటలో 13 మంది భారత బాక్సర్లు
author img

By

Published : Mar 3, 2020, 10:28 AM IST

ఆసియా ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో.. భారత ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి జోర్డాన్‌లోని అమ్మాన్​ వేదికగా ఈ​ టోర్నీ ప్రారంభం కానుంది. 63 స్థానాలకు జరుగుతున్న పోటీల్లో.. టోక్యో బెర్త్​ కోసం 13 మంది భారత బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ మెగాటోర్నీలో సెమీస్​కు చేరిన బాక్సర్లు టోక్యో బెర్త్​ ఖరారు చేసుకోనున్నారు.

తాజాగా ఇందుకోసం ప్రకటించిన జాబితాలో భారత స్టార్‌, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీ కోమ్‌కు రెండో సీడింగ్‌ లభించింది. ఆమె మహిళల 51 కేజీల విభాగంలో ఫేవరెట్‌గా ఉంది.

Boxing's Asian Olympic Qualifiers
మేరీకోమ్​ ప్రదర్శనలు

గత ఏడాది ప్రపంచ బాక్సింగ్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించిన అమిత్‌ ఫంగాల్‌ (52 కేజీలు)కు పురుషుల విభాగంలో టాప్‌ సీడింగ్‌ దక్కింది. కామన్వెల్త్‌ మాజీ ఛాంపియన్‌ వికాస్‌ కృష్ణన్‌తో పాటు రెండుసార్లు ప్రపంచ కాంస్య పతక విజేత లవ్లీనా (69 కేజీలు), పూజ (75 కేజీలు) తదితరులు ఈ టోర్నీలో ఆడుతున్నారు. మొత్తం భారత్​ నుంచి ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళా బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు.

Boxing's Asian Olympic Qualifiers
అమిత్‌ ఫంగాల్‌

భారత బృందమిదే:

పురుషులు: అమిత్​ ఫంగాల్​ (52కేజీలు), గౌరవ్​ సోలంకి (57కేజీలు), మనీశ్​ కౌశిక్​ (63 కేజీలు), వికాశ్​ కృష్ణన్​ (69 కేజీలు), ఆశిష్​ కుమార్​ (75 కేజీలు), సచిన్​ కుమార్​ (81 కేజీలు), నమన్​ తన్వార్​ (91 కేజీలు), సతీశ్​ కుమార్​ (+91 కేజీలు).

మహిళలు: మేరీకోమ్​ (51 కేజీలు), సాక్షి చౌదరి (57 కేజీలు), సిమ్రన్​జిత్​ కౌర్​ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజ (75 కేజీలు).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.