స్పెయిన్ వేదికగా జరుగుతోన్న బక్సమ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ ఫైనల్ పోరుకు ముందు.. భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. కరోనా కారణంగా టోర్నీ నుంచి ముగ్గురు బాక్సర్లు తప్పుకోవాల్సి వచ్చింది. 75 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆశీష్ కుమార్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని రూమ్మేట్లు అయిన మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీ), సుమిత్ సంగ్వాన్ (81 కేజీ) కూడా పోటీ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ఈ ముగ్గురికి రజత పతకాలు దక్కనున్నాయి.
ఫైనల్లో పోటీ పడితే వారికి స్వర్ణం గెలిచే అవకాశం ఉండేది. హుసాముద్దీన్, సంగ్వాన్‌లకు చేసిన కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినప్పటికీ.. స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టోర్నీ నుంచి తప్పుకోక తప్పలేదు.
మరోవైపు అనారోగ్యం కారణంగా మరో వెటరన్ బాక్సర్ సతీశ్ కుమార్ (91 పైన కేజీల విభాగం) కూడా ఫైనల్లో పాల్గొనలేదు. ఇతనికీ రజత పతకం దక్కనుంది.
'ఎంతో గొప్పగా ప్రారంభించిన బాక్సింగ్ పోటీలు.. చివరికిలా అర్ధాంతరంగా ముగిశాయి. ఆశీష్కు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు. అతడు బాగానే ఉన్నాడ'ని భారత బాక్సింగ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ శాంటిగో నీవా పేర్కొన్నారు.
ఒక్కరే 'బంగారం'..
పురుషుల విభాగంలో కేవలం మనీశ్ కుమార్ (63 కేజీ) మాత్రమే స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో డెన్మార్క్ ప్రత్యర్థి నికోలై టెర్టెర్యాన్పై మనీశ్ గెలుపొందాడు. మోకాలి గాయం నయమైన తర్వాత ఆడిన తొలి టోర్నమెంట్‌లోనే మనీశ్ సత్తా చాటాడు. 69 కేజీల విభాగంలో వికాస్ క్రిష్ణన్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పైగా ఈ పోటీలో అతనికి కంటికి గాయమైంది.
-
Many congratulations to #TOPSAthlete @iboxermanish for winning the gold medal in men’s 63 kg at the #BoxamElite tournament after beating Nikolai Terteryan. 5 boxers #Jasmine, @boxerpooja, @Simranjitboxer, @Hussamboxer and @officialvkyadav finished with a silver medal. pic.twitter.com/McnPARl0Zg
— SAIMedia (@Media_SAI) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Many congratulations to #TOPSAthlete @iboxermanish for winning the gold medal in men’s 63 kg at the #BoxamElite tournament after beating Nikolai Terteryan. 5 boxers #Jasmine, @boxerpooja, @Simranjitboxer, @Hussamboxer and @officialvkyadav finished with a silver medal. pic.twitter.com/McnPARl0Zg
— SAIMedia (@Media_SAI) March 6, 2021Many congratulations to #TOPSAthlete @iboxermanish for winning the gold medal in men’s 63 kg at the #BoxamElite tournament after beating Nikolai Terteryan. 5 boxers #Jasmine, @boxerpooja, @Simranjitboxer, @Hussamboxer and @officialvkyadav finished with a silver medal. pic.twitter.com/McnPARl0Zg
— SAIMedia (@Media_SAI) March 6, 2021
మహిళల విభాగం..
ఇక మహిళల బాక్సింగ్ విభాగంలో ఏ ఒక్కరూ బంగారు పతకం సాధించలేకపోయారు. సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీ) ఫైనల్ చేరినప్పటికీ.. పోటీ నుంచి తప్పుకుంది. ఆమె సెమీఫైనల్ ప్రత్యర్థి కిరియా తపియాకు కరోనా సోకింది. సిమ్రన్‌కు నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఆమెను పోటీల నుంచి బలవంతంగా తప్పించారు నిర్వాహకులు.
'స్థానిక ప్రభుత్వ కొవిడ్ మార్గదర్శకాల మేరకు.. సిమ్రన్‌జీత్ ఫైనల్లో పాల్గొనడం లేద'ని భారత బాక్సింగ్ ఉమెన్స్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో తెలిపారు.
పూజా రాణి, జాస్మిన్లు తుది పోటీలో ఓటమి పాలయ్యారు. దీంతో మొత్తం భారత ఖాతాలోకి ఒక స్వర్ణం, 8 రజతాలు, ఒక కాంస్య పతకాలు రానున్నాయి.
ఇదీ చదవండి: ఐదో టీ20లో ఆసీస్ చిత్తు.. కివీస్‌దే సిరీస్