ప్రముఖ రెజ్లర్, ఒలంపిక్స్ పతక విజేత యోగేశ్వర్ దత్‌ను హరియాణా బరోడా అసెంబ్లీ ఉపఎన్నికకు భాజపా అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. అంతకుముందు కొందరు క్రీడాకారులు హరియాణా ముఖ్యమంత్రి ఎమ్.ఎల్. ఖట్టర్‌ని దిల్లీలో కలిశారు. వీరిలో బబితా ఫోగాట్, సాక్షి మాలిక్, గీతా ఫోగాట్ లతో పాటు యోగేశ్వర్ దత్ ఉన్నారు. ఆ తర్వాత యోగేశ్వర్‌ను ఖట్టర్ అభ్యర్థిగా ప్రకటించారు. నవంబరు 3న బరోడా ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ కిషన్ హూడా ఏప్రిల్‌లో మరణించగా.. ఖాళీ ఏర్పడింది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది.
భాజపా ఖాతా తెరవలేదు :
బరోడాలో ఇప్పటివరకు భాజపా ఒక్కసారైనా గెలవలేదు. భాజపా అభ్యర్థిగా మొదట 25మంది పేర్లను పరిశీలించినట్లు ఖట్టర్ తెలిపారు. అందులో నలుగురి పేర్లను ఎంపిక చేసి పార్టీ హైకమాండ్‌కి పంపినట్లు వెల్లడించారు. వీరిలో దత్‌ను పార్టీ అభ్యర్థిగా ఫైనల్ చేసినట్లు వెల్లడించారు.
భైంస్వాల్ నుంచి బరోడాకు :
రెజ్లర్ యోగేశ్వర్ దత్ స్వస్థలం సోనెపట్ జిల్లాలోని భైంస్వాల్ కలాన్ గ్రామం. 2014 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించారు . 2013లో ఆయనకు పద్మశ్రీ వచ్చింది. అతను 2019 ఎన్నికల సమయంలో భాజపాలో చేరారు. వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్నందువల్ల ప్రస్తుతం దత్ ప్రచారంలో ఉన్నారు.