ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన 'ఫెన్సర్'​ భవానీ- ఒలింపిక్స్​కు అర్హత​

ఫెన్సర్​ భవానీ దేవీ చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.

Bhavani Devi becomes first Indian fencer to qualify for Olympics
ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్​
author img

By

Published : Mar 14, 2021, 9:37 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్​గా చరిత్ర సృష్టించింది తమిళనాడుకు చెందిన సీఏ భవానీ దేవీ. అడ్జెస్టెడ్ అఫీషియల్​ ర్యాంకింగ్​ ద్వారా భవానీ అర్హత సాధించింది. ఇది చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది భారత క్రీడా సమాఖ్య.

ఈ సందర్భంగా భవానీని అభినందించారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు. "టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన భారత ఫెన్సర్​ భవానీ దేవీకి అభినందనలు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది." అని రిజుజు ట్వీట్ చేశారు.

8 సార్లు జాతీయ ఛాంపియన్​గా నిలిచిన భవానీ రియో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయింది.

ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్​ జరగనున్నాయి.

ఇదీ చూడండి: టోక్యోనే నా చివరి ఒలింపిక్స్​: మేరీ కోమ్

ఇదీ చూడండి: ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.