మన దేశ స్టార్ బాక్సర్లు గౌరవ్ సోలంకి, సోనియా, సిమ్రన్‌జీత్ కౌర్ పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ). 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సిమ్రన్‌జీత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నలుగురు మహిళా బాక్సర్లలో ఆమె కూడా ఒకరు.
సాజన్‌ను మరోసారి..
ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించిన తొలి భారత స్విమ్మర్ సాజన్ ప్రకాశ్‌ను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత స్విమ్మింగ్ సమాఖ్య (ఎస్ఎఫ్ఐ). ప్రముఖ కోచ్ కమ్లేశ్ నానావటీని ధ్యాన్‌చంద్ పురస్కారానికి నామినేట్ చేసింది. పారాలింపిక్స్‌లో ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్లను తీర్చిదిద్దిన తపన్ పానీగ్రహీ పేరును ద్రోణాచార్య అవార్డుకు పంపింది ఎస్ఎఫ్ఐ.
టోక్యోలో తన రెండో ఒలింపిక్స్‌లో పోటీపడనున్న ప్రకాశ్ పేరును అర్జునకు సిఫార్సు చేయడం ఇది వరుసగా రెండో ఏడాది. రోమ్‌లో జరిగిన 200మీ. బటర్‌ఫ్లై విభాగంలో ఒక్క నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి జాతీయ రికార్డు నెలకొల్పిన అతను.. అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (ఫినా) 'ఏ' ప్రమాణాన్ని అందుకున్న తొలి భారత స్విమ్మర్‌గా ఘనత సాధించాడు.
ఇవీ చూడండి:
Tokyo Olympics: కష్టాలను ఎదురీది.. ఒలింపిక్స్ గమ్యాన్ని చేరి!