ETV Bharat / sports

కృత్రిమ మంచులోనే వింటర్​ ఒలింపిక్స్​.. చరిత్రలో తొలిసారి!

Beijing Olympics Artificial Snow: బీజింగ్​లో గడ్డకట్టే చలిలో వివిధ క్రీడల్లో పోటీ పడుతున్నారు అథ్లెట్లు. అయితే ఈ శీతాకాల ఒలింపిక్స్​ పూర్తిగా కృత్రిమ మంచుపై జరుగుతున్నాయని తెలుసా? దానిని ఎలా తయారు చేస్తారంటే..

beijing olympics artificial snow
శీతాకాల ఒలింపిక్స్‌
author img

By

Published : Feb 6, 2022, 7:12 AM IST

Beijing Olympics Artificial Snow: శీతాకాల ఒలింపిక్స్‌ సందడి మొదలైంది. అథ్లెట్లు మంచుపై దూసుకెళ్తూ వివిధ విభాగాల్లో పోటీపడుతున్నారు. కానీ అది నిజమైన హిమం కాదు.. అంటే ఆకాశం నుంచి కురిసిన మంచు కాదు. దాన్ని కృత్రిమంగా తయారు చేశారు. అవును.. ఇది నిజం. ప్రత్యేకంగా శీతాకాల ఒలింపిక్స్‌ కోసం చైనా భారీ స్థాయిలో కృత్రిమంగా మంచు తయారు చేసింది. ఈ ఒలింపిక్స్‌ చరిత్రలోనే దాదాపు మొత్తం కృత్రిమ మంచు మీద జరుగుతున్న తొలి క్రీడలు ఇవే. అత్యాధునిక యూరోపియన్‌ యంత్రాలను వాడి కొన్ని నెలల పాటు కష్టపడి ఈ మంచును ఏర్పాటు చేశారు.

ఎలా చేశారు?: వాతావరణంలోని నీటి ఆవిరి ఘనీభవించడంతోనే హిమపాతం ఏర్పడుతుంది. చల్లని గాలి తాకగానే ఘనీభవించే నీరు మంచు స్పటికాలుగా మారుతుంది. ఆ స్పటికాలన్నీ ఒక్క దగ్గర చేరి గురుత్వాకర్షణ కారణంగా నేలపై పడతాయి. దాన్నే మంచు అంటారు. కానీ చైనాలో అతి తక్కువ మంచు పడుతుంది. దీంతో ఈ ఒలింపిక్స్‌ కోసం కృత్రిమ మంచు కురిపించాల్సి వచ్చింది. అందుకోసం పరమాణువులతో కూడిన నీటిని, యాంత్రికంగా తయారు చేసిన న్యూక్లియేటర్స్‌ (చిన్న మంచు స్పటికాలు)ను భారీ పంపుల ద్వారా గాలిలోకి పంపించారు. అవి కలిసి మంచుగా ఏర్పడి భూమిని తాకింది. ఈ విధానం కొన్ని దశాబ్దాల ముందు నుంచే ఉంది. 1980 న్యూయార్క్‌ ఒలింపిక్స్‌లో ఇలా తయారు చేసిన మంచును తొలిసారి వాడారు. ఇప్పుడు బీజింగ్‌ క్రీడల్లో కృత్రిమ మంచు తయారీ కోసం అవసరమైన యంత్రాలను అందించేందుకు టెక్నోఆల్పిన్‌ సంస్థ సుమారు రూ.164 కోట్లతో ఒప్పందం చేసుకుంది. స్కీయింగ్‌, స్నోబోర్డింగ్‌ పోటీల వేదికల్లో సాంకేతిక మంచు కోసం 272 ఫ్యాన్‌ గన్స్‌, 82 స్టిక్‌ ల్యాన్సెన్‌ను ఉపయోగించింది.

beijing olympics artificial snow
కృత్రిమ మంచు

భారీగా నీరు..: ఈ కృత్రిమ మంచు ఏర్పాటు కోసం భారీ స్థాయిలో నీటిని వాడారు. గోబి ఏడారికి మరీ దూరంగా లేని బీజింగ్‌, ఝాంగియాకో ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువ. 2015లో బీజింగ్‌కు ఈ క్రీడల ఆతిథ్య హక్కులను కట్టబెట్టేముందు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) కూడా ఇదే విషయాన్ని చైనాతో ప్రస్తావించింది. అధిక స్థాయిలో కృత్రిమ మంచు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సూచించింది. ఇప్పుడీ క్రీడల్లో మంచు కోసం నిర్వాహకులు 490 లక్షల గాలన్ల (ఒక్క గాలన్‌ 3.78 లీటర్లకు సమానం) నీటిని ఉపయోగించనున్నట్లు తెలిసింది. అది 74 ఒలింపిక్‌ ఈత కొలనుల్లోని నీటితో సమానం. నీటిని గడ్డ కట్టేలా చేసేందుకు రసాయనాలు వాడాల్సి ఉంటుంది. మరోవైపు విద్యుత్‌ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో పర్యావరణానికి హాని కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ కృత్రిమ మంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని అథ్లెట్లు అభిప్రాయపడ్డారు. ఈ మంచులో తేమ అధికంగా ఉంటుందని అది త్వరగా గడ్డకడుతుందని నిపుణులు పేర్కొన్నారు. కానీ ఐఓసీ మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతోంది.

ఇదీ చూడండి: కళ్లు చెదిరేలా వింటర్​ ఒలింపిక్స్.. ఫుల్ జిగేల్ జిగేల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.