సాధారణంగా రాజకీయ నాయకుల సమావేశాలకో, సినీ హీరోని చూడటానికో ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. కానీ తమ జట్టు గెలిచిందని అర్ధరాత్రి పూట వేలమంది కలిసి సంబురాలు చేసుకున్నారు అమెరికాలో వర్జీనియా ప్రజలు.
వర్జినీయా క్యావలీర్స్, టెక్సాస్ జట్ల మధ్య జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ సోమవారం జరిగింది. ఈ పోరులో టెక్సాస్పై వర్జీనియా 85-77 పాయింట్ల తేడాతో నెగ్గింది. అంతే వర్జీనియా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీధుల్లో వేల మంది హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు... వర్జీనియా జట్టు తొలిసారి జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది.