రోమ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక రోమ్ ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్లో.. భారత రెజ్లర్లు సత్తా చాటారు. అంతర్జాతీయ వేదికపై రవికుమార్ దాహియా, బజ్‌రంగ్.. స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.
చిత్తుచిత్తుగా
61 కేజీల విభాగం ఫైనల్లో అబ్దులియేవ్ (కజికిస్థాన్)ను 12-2తో చిత్తుగా ఓడించాడు భారత రెజ్లర్ రవికుమార్. శనివారం జరిగిన మరో విభాగం ఫైనల్లో స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ (65 కేజీ) పునియా స్వర్ణం గెలిచాడు. 4-3తో జోర్డాన్ మైకెల్ ఒలివర్ (అమెరికా)ను ఓడించాడు పునియా.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత విజేత దీపక్ పునియా (86 కేజీ), జితేందర్ (74 కేజీ) ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీపక్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా, జితేందర్‌కు రెపీచేజ్ రౌండ్ ఆడే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.