ETV Bharat / sports

జంతర్​ మంతర్​ ఎదుట బైఠాయించిన రెజ్లర్లు.. ఫెడరేషన్​కు వ్యతిరేకంగా నిరసనలు..! - Wrestlers Stage Protest against WFI President

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా భారత్​లోని రెజ్లర్లు దిల్లీ జంతర్​ మంతర్​ ఎదుట నిరసనకు బైఠాయించారు. ఇందులో స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్​లు పాల్గొని మద్దతు తెలిపారు.

wrestlers protest at jantar mantar
wrestlers protest at jantar mantar
author img

By

Published : Jan 18, 2023, 2:19 PM IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా దిల్లీ జంతర్​ మంతర్​ ముందు నిరసనకు బైఠాయించారు స్టార్​ రెజ్లర్లు​ బజరంగ్​ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్​. రెజ్లర్ జాతీయ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వైఖరికి వ్యతిరేకంగా ఈ నిరసనలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ నిరసనకు మద్దతిచ్చేందుకు బజరంగ్​ పునియా కోచ్ సుజీత్ మాన్, ఫిజియో ఆనంద్ దూబే సహా బజరంగ్ సహాయక సిబ్బంది కూడా పాల్గొన్నారు. దాదాపు 30 మంది రెజ్లర్లు పాల్గొన్న ఈ నిరసనలో బజరంగ్, వినేష్​తో పాటు సరితా మోర్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ మాలిక్, జితేందర్ కిన్హా, సుమిత్ మాలిక్​ హాజరయ్యారు. సాయంత్రం ప్రెస్​ కాన్ఫరెన్స్ నిర్వహించి మరిన్ని వివరాలను బయటపెడుతామన్నారు.

"మా పోరాటం ప్రభుత్వం లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా కాదు. ఇది డబ్ల్యుఎఫ్‌ఐకి వ్యతిరేకం. 'యే అబ్ ఆర్ పార్ కి లడై హై' (ఇది ముగింపు వరకు పోరాటం). రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా పనిచేస్తున్న విధానానికి వ్యతిరేకంగా మేము ఈ నిరసనను తెలియజేస్తున్నాం. దీనికి ఏ విధమైన రాజకీయాలతో సంబంధం లేదు. మేము ఇక్కడకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. ఇది పూర్తిగా మల్లయోధుల నిరసన."

--బజరంగ్​ పునియా, రెజ్లర్​

"నిర్ణయాలు తీసుకునే విషయంలో రెజ్లర్ల సమస్యను లేవనెత్తడానికి మేము ఇక్కడ ఉన్నాము. రెజ్లర్లు చాలా కాలం పాటు బాధలను ఎదుర్కొని నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఇకపై నిశ్శబ్దంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాము. మా డిమాండ్లు నెరవేరే వరకు భారతదేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లందరూ జాతీయ లేదా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనరు" అని పునియా చెప్పాడు. కాగా 2011 నుంచి అధికారంలో ఉన్న సింగ్​.. 2019లో వరుసగా మూడోసారి ఫెడరేషన్​కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

wrestlers protest at jantar mantar
జంతర్​ మంతర్​ ముందు రెజ్లర్ల నిరసన
wrestlers protest at jantar mantar
జంతర్​ మంతర్​ ముందు రెజ్లర్ల నిరసన

'దేశానికి పతకాలు సాధించేందుకు ఆటగాళ్లు అన్ని విధాలా ప్రయత్నిస్తారు.. కానీ ఫెడరేషన్ మమ్మల్ని తక్కువగా చూడటం తప్ప చేసిందేమీ లేదు. అథ్లెట్లను చిత్రహింసలకు గురి చేసేందుకు ఏకపక్ష నిబంధనలు రూపొందిస్తున్నారు' అని రెజ్లర్​ సాక్షి ట్వీట్ చేసింది. అన్షు మాలిక్, సంగీతా ఫోగట్​తో పాటు ఇతర రెజ్లర్లు కూడా ఇదే తరహాలో 'బాయ్‌కాట్‌ డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్' హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

wrestlers protest at jantar mantar
బజరంగ్​ పునియా ట్వీట్​
wrestlers protest at jantar mantar
వినేశ్​ ఫోగట్​ ట్వీట్​
wrestlers protest at jantar mantar
సాక్షి మాలిక్​ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.