ఆసియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెల్చుకున్న భారత్ రెజ్లర్ బజరంగ్ పూనియా.. ప్రఖ్యాత రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి నామినేట్ అయ్యాడు. బైచుంగ్ భూటియా, మేరీకోమ్ ఉన్న 12 మంది సభ్యుల కమిటీ ఇతడి పేరును ప్రతిపాదించింది. దీనిపై ఆనందం వ్యక్తం చేశాడు ఈ రెజ్లర్.
గతేడాది మలేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు బజరంగ్. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో అదే కేటగిరీలో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు పతకాలు పొందాడు. వచ్చే సంవత్సరం జరిగే టోక్సో ఒలింపిక్స్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు.
ఇది చదవండి: విరాట్ కోహ్లీ ప్రత్యేకం: రన్ మెషీన్... రికార్డులు చెదిరెన్..!