ETV Bharat / sports

అథ్లెట్స్​ బజరంగ్​, ఎలవెనిన్​లకు అరుదైన పురస్కారం - బజరంగ్​ పూనియా ఎఫ్​ఐసీసీఐ అవార్డు

దేశంలో క్రీడా పురస్కారం 'ఎఫ్​ఐసీసీఐ'కి రెజ్లర్​ బజరంగ్​ పూనియా, షూటర్​ ఎలవెనిన్​ ఎంపికయ్యారు. 2019-20 ఏడాదికిగానూ సంబంధిత క్రీడా రంగాల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన కారణంగా వారిద్దరూ ఈ అవార్డును అందుకున్నారు.

Bajrang Punia, Elavenil Valarivan bag top honours at FICCI India Sports Awards
అథ్లెట్స్​ బజరంగ్​, ఎలవెనిన్​లకు అరుదైన ఘనత
author img

By

Published : Dec 9, 2020, 4:20 PM IST

మన అథ్లెట్లు బజరంగ్​ పూనియా, ఎలవెనిన్ వలారివన్​లకు అరుదైన అవార్డు లభించింది. 2019-20 ఏడాదికిగానూ తమతమ రంగాల్లో ఉన్నతంగా రాణించిన కారణంగా, క్రీడా పురస్కారం 'ఎఫ్​ఐసీసీఐ'కి ఎంపికయ్యారు. కరోనా ప్రభావమున్న నేపథ్యంలో వర్చువల్​గా వీటిని ప్రదానం చేశారు.

రెజ్లర్​ బజరంగ్​ పూనియా.. ప్రస్తుతం అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ పురస్కారానికి తామిద్దరూ ఎంపికవ్వడంపై బజరంగ్​, ఎలవెనిన్​ ఆనందం వ్యక్తం చేశారు.

"భవిష్యత్​లో ఉత్తమంగా రాణిస్తూ, దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావడమే లక్ష్యం. మా ప్రతిభకు ఇలాంటి గుర్తింపు లభించినప్పుడు అది మరింత ప్రేరణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఇతర పురస్కారాల విజేతలకూ నా అభినందనలు"

- బజరంగ్​ పూనియా, రెజ్లర్​

"నా కెరీర్​లో వెన్నంటే ఉన్న నా కుటుంబ సభ్యులకు, మార్గనిర్దేశకుడు గగన్​ నారంగ్​తో పాటు కోచ్​ నేహా చౌహాన్​లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాతీయ రైఫిల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​ఆర్​ఏఐ) కష్టసమయాల్లోనూ నాకెంతో మద్దతుగా నిలిచింది. స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా, ఆటకు కావాల్సిన సామాగ్రినంతా సమకూర్చింది"

- ఎలవెనిన్ వలారివన్​, షూటర్​

ఎఫ్​ఐసీసీఐ పరిశ్రమ సంస్థ.. వివిధ క్రీడారంగంలో ఉన్నత ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తుంది. దిగ్గజ క్రికెటర్​ అనిల్​ కుంబ్లేకు 'ఉత్తమ క్రీడా ప్రోత్సాహక సంస్థ' పురస్కారం దక్కింది. టెన్​విక్​ స్పోర్ట్స్​ ప్రైవేట్​ సంస్థలో భాగంగా ఈ అవార్డును అందుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.