ETV Bharat / sports

ఆసియా రెజ్లింగ్​​ ఫైనల్లో నలుగురు భారతీయులు - ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​ 2020

ఆసియా రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత్​కు చెందిన భజరంగ్​ పునియా(65 కేజీలు), రవి దహియా(57 కేజీలు), సత్యవర్త్​ కడియన్(97 కేజీలు)​, గౌరవ్​ బలియన్(79 కేజీలు) తుదిపోరుకు అర్హత సాధించారు.​

Asian Wrestling Championships 2020
ఆసియా రెజ్లింగ్​​లో ఫైనల్​ చేరిన నలుగురు భారతీయులు
author img

By

Published : Feb 22, 2020, 7:04 PM IST

Updated : Mar 2, 2020, 5:14 AM IST

దిల్లీ వేదికగా జరుగుతున్న ఆసియా రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత క్రీడాకారులు అదరగొట్టేశారు. పలు విభాగాల్లో నలుగురు రెజ్లర్లు ఫైనల్​కు చేరారు. భజరంగ్​ పునియా(65 కేజీలు), రవి దహియా(57 కేజీలు), సత్యవర్త్​ కడియన్(97 కేజీలు)​, గౌరవ్​ బలియన్(79 కేజీలు) ఉన్నారు. వీరు ఇప్పటికే రజతాలు ఖాయం చేసుకున్నారు.

భజరంగ్​ ఫామ్​

టోక్యో ఒలింపిక్స్​ ముందు జరుగుతున్న ఈ మెగాటోర్నీలో సత్తా నిరూపించుకున్నాడు భజరంగ్​. ఆసియా గేమ్స్​లో పసిడి గెలిచిన ఇతడు.. వరుసగా ముగ్గురు స్టార్​ రెజ్లర్లను ఓడించాడు. తొలుత షరిఫోవ్​(తజకిస్థాన్), క్వార్టర్స్​లో అబ్బోస్​ రక్మనోవ్​(ఉజ్బెకిస్థాన్​), సెమీస్​లో అమిర్​ హొస్సేన్​(ఇరాన్​)ను ఓడించి ఫైనల్​ చేరాడు. ముగ్గురిపైనా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. తుది పోరులో 2018 వరల్డ్​ ఛాంపియన్​ టకుటో ఒటోగురో(జపాన్​)తో తలపడనున్నాడు.

>> రవి దహియా.. ప్రపంచ​ ఛాంపియన్​షిప్​ కాంస్య విజేత నూరిస్లామ్​ సనయవ్​(కజకిస్థాన్​)పై సెమీఫైనల్లో గెలిచాడు. ఫైనల్లో హిక్మతుల్లో(తజకిస్థాన్​)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

>> సత్యవర్త్​ కడియన్​.. సెమీస్​లో రస్టమ్​ ఇస్కాందరీ(తజకిస్థాన్​)పై గెలిచాడు. ఫైనల్లో ఇరాన్​ ఆటగాడు మోజటబాతో పోటీకి సిద్ధమవుతున్నాడు.

>> గౌరవ్​ బలియన్.. జపాన్​ రెజ్లర్​ షింకిచి ఒకుయ్ను ఓడించి ఫైనల్​ చేరాడు. ఫైనల్లో అర్సలన్​ (కిర్గిస్థాన్​)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ఐదు విభాగాల్లో నలుగురు తుదిపోరు అర్హత సాధించడం విశేషం. నవీన్​(70కేజీల) ఒక్కడే సెమీఫైనల్లో ఓడిపోయాడు. కాంస్య పోరులో అషిరోవ్​(ఉజ్బెకిస్థాన్​)తో తలపడనున్నాడు.

Last Updated : Mar 2, 2020, 5:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.