భారత మేటి రెజ్లింగ్ క్రీడాకారులంటే టక్కున గుర్తొచ్చే పేర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్. వారి బాటలోనే నడుస్తూ స్టార్‌గా ఎదిగాడు బజరంగ్ పునియా. తాజాగా రష్యాలో జరిగిన అలీ అలియెవ్ రెజ్లింగ్ టోర్నీలో భారత్‌కు స్వర్ణం అందించాడు. రష్యన్ ఆటగాడు విక్టర్ రసాదిన్‌ను 13-8తో ఓడించి బజరంగ్ విజయ బావుటా ఎగరేశాడు. 2020 ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు పతకం తెస్తానంటు ధీమా వ్యక్తం చేస్తున్నాడు బజరంగ్.
![bajarang punia wrestling champ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3174876_bajrang12.jpg)
అరుదైన పిలుపు...
అమెరికా గడ్డపై ఆ దేశ ఆటగాడు 'డియాకో మిహలిస్'తో పోటీ పడేందుకు బజరంగ్‌కు పిలుపు వచ్చింది. ప్రత్యర్థి 47 విజయాల వీరుడు. అందుకే అతడికి మనోడే సరైన పోటీ అని భావించిన అమెరికా రెజ్లింగ్ సంఘం... మే 6న పోటీకి ఆహ్వానం పంపింది. ఇప్పటి వరకు భారత రెజ్లింగ్ చరిత్రలో ఇలా పిలుపు రావడం తొలిసారి. అమెరికా గడ్డపై పోరుకు వెళ్తుండటం బజరంగ్ సత్తాకు నిదర్శనం. సోమవారం న్యూయర్క్ 'మాడిసన్ స్క్వేర్ గార్డెన్' వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
![bajarang punia wrestling champ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3174876_bajrang_final.jpg)
పతకాల రారాజు...
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ఇటీవలే ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పసిడి ఇలా బజరంగ్ తన ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన చేస్తున్నాడు.
![bajarang punia wrestling champ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3174876_bajrang3.jpg)
గురువే స్ఫూర్తి...
బజరంగ్‌ను ఇంతటి క్రీడాకారుడిగా చెక్కిన శిల్పి గురువు యోగేశ్వర్ దత్. అందుకే ఆయనే నా మార్గదర్శకుడు, శ్రేయోభిలాషి అంటుంటాడు పునియా. బజరంగ్ ఆటతీరుని నిరంతరం పరిశీలిస్తూ... మెరుగ్గా తీర్చిదిద్దడంలో యోగేశ్వర్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
పేదరికమే పట్టు నేర్పింది...
బజరంగ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అతడు రెజ్లర్‌గా తయారు చేసేందుకు వాళ్ల కుటుంబం ఎన్నో శ్రమలు ఓర్చుకుంది. తండ్రి రెజ్లర్ కావడమే ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించిందని చెప్తుంటాడు పునియా.
![bajarang punia wrestling champ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3174876_parents.jpg)
ఇష్టమైనవి...
ఈ స్టార్ కుస్తీ వీరుడికి కబడ్డీ బాగా ఇష్టం. ఖాళీ సమయాల్లో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ ఆడుతుంటాడు. హర్యాణ్వీ, పంజాబీ సంగీతం ఇష్టపడుతుంటాడీ టాటా యోధా.
ఆ ప్రశంస మరిచిపోలేనిది:
'2013లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం ఎప్పటికీ మరిచిపోలేను. సీనియర్ విభాగంలో ప్రపంచ వేదికపై నన్ను నేను నిరూపించుకున్న తొలి అవకాశమది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినపుడు... దేశానికి రత్నం లాంటి కొడుకును ఇచ్చారని మా అమ్మను ఆయన ప్రశంసించడం చాలా గొప్పగా అనిపించింది.'
--బజరంగ్ పునియా, భారత రెజ్లర్ప్రధాని మోదీతో బజరంగ్