ETV Bharat / sports

పాతికేళ్లు కోచ్​గా కొనసాగిన బహదూర్​ రాజీనామా - Bahadur Singh news

భారత అథ్లెటిక్స్​కు కోచ్​గా 25 ఏళ్లపాటు సుదీర్ఘంగా పనిచేసిన బహదూర్​ సింగ్​ తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. కోచ్​గా 70 ఏళ్లు మించకూడదనే నిబంధన కారణంగా శిక్షకుడిగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పాతికేళ్ల పాటు కోచ్​గా పనిచేసిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు బహదూర్​.

Bahadur Singh resigns as Indian athletics chief coach after 25 years
పాతికేళ్లుగా కోచ్​గా కొనసాగిన బహదూర్​ రాజీనామా
author img

By

Published : Jul 7, 2020, 9:26 PM IST

పాతికేళ్లుగా భారత అథ్లెటిక్స్​ ప్రధానకోచ్​గా పనిచేస్తోన్న బహదూర్​ సింగ్​.. ఆ పదవికి తాజాగా రాజీనామా చేశారు. భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ వయసు పరిమితుల ఆధారంగా కాంట్రాక్టు పొడిగింపును నిరాకరించడం వల్ల బహదూర్​ కోచ్​గా వైదొలిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1995లో కోచ్​గా జాతీయ శిబిరాల్లో చేరిన బహదూర్​.. 25 ఏళ్లపాటు సుదీర్ఘంగా కోచ్​గా వ్యవహరిస్తూ ఎక్కువ కాలం శిక్షకుడిగా పనిచేసిన ఘనతను సాధించారు​. జాతీయ శిక్షణా శిబిరాల్లో కోచ్​ల అత్యధిక వయసు పరిమితి 70కు మించి ఉండకూడదనే మార్గదర్శకాల ప్రకారం ఆ పదవిలో బహదూర్​ కొనసాగించడానికి నిరాకరించింది క్రీడా మంత్రిత్వశాఖ.

కోచ్​గా కాకపోయినా..

2010లో దిల్లీ వేదికగా జరిగిన కామన్​వెల్త్​ క్రీడల్లో భారత్​ రెండు స్వర్ణాలతో సహా 12 అథ్లెటిక్స్​ పతకాలు సాధించింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 8 బంగారు పతకాలు, 9 రజతాలతో పాటు ట్రాక్​, ఫీల్డ్​ పోటీల్లో​ 20 పతకాలు సాధించింది భారత్. విశ్వసనీయ సమాచారం మేరకు బహదూర్​ కోచ్​ పదవికి రాజీనామా చేసినా.. భారత అథ్లెటిక్స్​కు సలహాదారునిగా ఉంటారని తెలుస్తోంది.

పతకాలు.. పురస్కారాలు

74 ఏళ్ల బహదూర్​ సింగ్​.. 1978, 1982 ఆసియన్​ గేమ్స్​లో షాట్​పుట్​ విభాగంలో బంగారు పతకం సాధించారు. 1974 దిల్లీలో జరిగిన ఆసియన్​ గేమ్స్​లో రజత పతకాన్ని దక్కించుకున్నారు. ట్రాక్​, ఫీల్డ్​ మీట్స్​లో కాంస్యం (1973), బంగారు (1975), కాంస్యం (1979), రజత (1981) పతకాలను గెలుచుకున్నారు బహదూర్​. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్​లో పాల్గొన్నారు. 1976లో అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ, 1998లో ద్రోణాచార్య పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది.

ఇదీచూడండి... టాప్​-6: ధోనీ కెరీర్​లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.