ETV Bharat / sports

Australian Open: మహిళల డబుల్స్‌ టైటిల్​ గెలిచిన క్రెజికోవా, సైనికోవా - ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 న్యూస్

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్​ను కైవసం చేసుకున్నారు చెక్​ రిపబ్లిక్ క్రీడాకారిణులు బార్బోవా క్రెజికోవా, కతెరినా సైనికోవా. ఈ విజయంతో కెరీర్​లో నాలుగో గ్రాండ్​ స్లామ్​ అందుకున్నారు.

Krejcikova and Siniakova
క్రెజికోవా, సైనికోవా
author img

By

Published : Jan 30, 2022, 3:01 PM IST

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణులు బార్బోవా క్రెజికోవా, కతెరినా సైనికోవా విజయం సాధించారు. కజికిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినా, బ్రెజిల్‌ క్రీడాకారిణి బియాట్రిజ్‌ హద్దద్‌ మాయాపై 6-7 (3), 6-4, 6-4 తేడాతో గెలుపొందారు.

కాగా, ఈ విజయం వారిద్దరికీ నాలుగో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. 2018, 2021లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించిన ఈ చెక్‌ రిపబ్లికన్‌ క్రీడాకారిణులు 2018లో వింబుల్డన్‌ విజేతలుగా సైతం నిలిచారు. ఈ క్రమంలోనే ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజయం సాధించి కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌ స్లామ్‌ అందుకున్నారు. 2 గంటల 42 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థులు వీరికి గట్టి పోటీనిచ్చారు. అయినా, పట్టుదలగా ఆడి చివరికి విజేతలుగా నిలిచారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Australina Open: ఉత్కంఠ పోరు.. టైటిల్​ గెలిచేది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.