Australian Open 2022: స్పెయిన్ బుల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫ్పాడించి సరికొత్త చరిత్రను లిఖించాడు. జకోవిచ్, రోజర్ ఫెదరర్‌లను కాదని టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో నాదల్ గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 21కి చేరింది. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే రఫేల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సొంతం చేసుకోవడం విశేషం. సీనియర్ ప్లేయర్ అయిన నాదల్ ముందు మెద్వెదెవ్ నిలవలేకపోయాడు.
ఆఖరి సెట్‌వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో మెద్వెదెవ్‌పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫేల్ నాదల్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 21వ గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవడం విశేషం. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్.. ఆఖరి మూడు సెట్లలో అసమాన పోరాటం కనబరిచి విజయం సాధించడంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
తొలి సెట్‌ను మెద్వెదెవ్ దూకుడుగా ఆడి 6-2 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో నాదల్ తీవ్రంగా పోరాడినా 6-7తో మెద్వెదెవ్ విజయం సాధించాడు. వరుసగా రెండు సెట్లను కోల్పోయిన నాదల్ ఎక్కడా తగ్గలేదు. తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి చివరి మూడు సెట్లలో (6-4, 6-4, 7-5) విజయం సాధించి రికార్డు నమోదు చేశాడు. ఇద్దరూ చెరో రెండు సెట్లను గెలవడంతో మ్యాచ్ ఐదో సెట్‌కు వెళ్లింది. అయితే అక్కడా మెద్వెదెవ్ పట్టువిడవకపోవడంతో నాదల్ కాస్త శ్రమ పడాల్సి వచ్చింది. ఓ వైపు గాయం నొప్పి వెంటాడుతున్నా ఏమాత్రం లెక్క చేయక దాదాపు ఐదున్నర గంటలపాటు పోరాడటం విశేషం.
-
Let it all out, @RafaelNadal 🤗#AusOpen • #AO2022 pic.twitter.com/w2Ro5aMsDB
— #AusOpen (@AustralianOpen) January 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Let it all out, @RafaelNadal 🤗#AusOpen • #AO2022 pic.twitter.com/w2Ro5aMsDB
— #AusOpen (@AustralianOpen) January 30, 2022Let it all out, @RafaelNadal 🤗#AusOpen • #AO2022 pic.twitter.com/w2Ro5aMsDB
— #AusOpen (@AustralianOpen) January 30, 2022
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:
Australian Open: మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన క్రెజికోవా, సైనికోవా
14 ఏళ్లకే మహిళల సింగిల్స్ టైటిల్.. యంగెస్ట్ ఇండియన్‌గా గుర్తింపు