Australian Open 2022 Final: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో ఆమె అమెరికాకు చెందిన డేనియల్ కొలిన్స్‌ను ఓడించింది. 6-3, 7-6 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. రెంటో సెట్లో ఓ దశలో 1-5 తో వెనుకబడిపోయిన బార్టీ గొప్పగా పుంజుకుంది. కొలిన్స్ చేసిన అనవసర తప్పిదాలను సద్వినియోగం చేసుకుంది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించి పోటీలోకి వచ్చింది. ఈ విజయంతో తన కెరీర్లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించింది బార్టీ.
మరోవైపు సంచలన ప్రదర్శనతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన అమెరికా అమ్మాయి డేనియల్ కొలిన్స్‌కు తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరాశే ఎదురైంది. ఇంతకు ముందు బార్టీ రెండు గ్రాండ్‌స్లామ్‌లు (2021 వింబుల్డన్, 2019 ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గినా.. తన స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సొంతం చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన రెండో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ చరిత్ర సృష్టించింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్టినా ఓనీల్ టైటిల్ సాధించింది.
-
Made Down Under ™️🇦🇺@ashbarty • #AusOpen • #AO2022 pic.twitter.com/9zAY1GKD3w
— #AusOpen (@AustralianOpen) January 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Made Down Under ™️🇦🇺@ashbarty • #AusOpen • #AO2022 pic.twitter.com/9zAY1GKD3w
— #AusOpen (@AustralianOpen) January 29, 2022Made Down Under ™️🇦🇺@ashbarty • #AusOpen • #AO2022 pic.twitter.com/9zAY1GKD3w
— #AusOpen (@AustralianOpen) January 29, 2022
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:
2007 ప్రపంచకప్ ఫైనల్లో అందుకే ఔటయ్యా: మిస్బా
పాక్ జట్టుకు షాక్.. రెండు మెగా ఈవెంట్లలోనూ ఆసీస్ చేతుల్లోనే