ETV Bharat / sports

అమెరికా బాటలో మరిన్ని దేశాలు.. బీజింగ్​ ఒలింపిక్స్​ బహిష్కరణ - వింటర్‌ ఒలింపిక్స్‌

Beijing Olympics boycott: అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా, యూకే, కెనడా పయనించాయి. 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. పలు అంశాలపై చైనాతో తీవ్ర విభేదాలు కొనసాగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

Beijing Olympics boycott
బీజింగ్​ ఒలింపిక్స్
author img

By

Published : Dec 9, 2021, 10:15 AM IST

Beijing Olympics boycott: అమెరికా బాటలోనే.. 2022 బీజింగ్ వింటర్​ ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరించాయి ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్​డమ్, కెనడా. ఈ మేరకు ఆయా దేశాధినేతలు ప్రకటనలు చేశారు. అగ్రరాజ్యం తరహాలోనే తమ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్​లో పాల్గొంటారని, కానీ ప్రభుత్వ అధికారులను మాత్రం చైనాకు పంపమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం యూకే, కెనడా కూడా తమ దౌత్యవేత్తలు, అధికారులు క్రీడలకు హాజరుకారని ప్రకటించాయి. చైనా ప్రభుత్వం పదేపదే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు.

లక్షలాది వీఘర్లను బీజింగ్.. నిర్బంధ కేంద్రాలలో బంధీలను చేసిందని అమెరికా సహా పాశ్చాత్య దేశాల ఆరోపిస్తున్నాయి. అక్కడ తమను వేధించడం సహా తమపై అత్యాచారం జరిపినట్లు బంధీలుగా గడిపి వచ్చిన పలువురు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది.

ఇదీ చూడండి: '2022 బీజింగ్​ ఒలింపిక్స్​ దౌత్యపరంగా బహిష్కరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.