ETV Bharat / sports

స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు

భారత స్ప్రింటర్ హిమదాస్​ను డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

sprinter
స్ప్రింటర్​
author img

By

Published : Feb 11, 2021, 9:52 AM IST

స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమెను డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించబోతున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్‌, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర క్రీడా మంత్రి రిజిజు స్వాగతించారు.

ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1, ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ విజేతలను క్లాస్​-2 ఆఫీసర్లుగా నియమించనున్నారు. కాగా, 20 ఏళ్ల అసోం స్టార్‌ స్పింటర్‌ హిమదాస్​.. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ అండర్‌-20 ఛాంపియన్‌ షిప్స్‌లో గ్లోబల్‌ ట్రాక్‌ ఈవెంట్​లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది.

ఇదీ చూడండి: 'ఒలింపిక్స్​కు అర్హత సాధించకపోయినా బాధపడట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.