ETV Bharat / sports

Asian Games Medals List : పతకాల వేటలో అథ్లెట్లు.. ట్రాప్​ షూటింగ్​లో భారత్​కు స్వర్ణం - ఆసియా క్రీడలు 2023 మెడల్స్​ లిస్ట్

Asian Games Medals List : ఆసియా క్రీడల్లో భారత్​కు పతకాల​ వెల్లువ కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఈవెంట్స్​లో మన అథ్లెట్లు స్వర్ణ, రజత పతకాలను సాధించారు.

Asian Games Medals List
Asian Games Medals List
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 10:43 AM IST

Updated : Oct 1, 2023, 2:19 PM IST

Asian Games Medals List : ఆసియా క్రీడల్లో భారతకు మెడల్స్​ వెల్లువ కొనసాగుతోంది. ఆదివారం జరిగన ఈవెంట్స్​లో మన అథ్లెట్లు స్వర్ణ, రజత పతకాలను సాధించారు. ట్రాప్ షూటింగ్‌ పురుషుల విభాగంలో భారత త్రయం పృథ్వీరాజ్ తొండైమాన్, కినాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు పసిడి పతకాన్ని ముద్దాడగా.. మహిళల విభాగానికి చెందిన మనీశా కీర్, రాజేశ్వరి కుమారి, ప్రీతి రజక్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మరోవైపు గోల్ఫ్​లో భారత్​కు చెందిన అదితి అశోక్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ క్రమంలో ఆమె గోల్ఫ్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా గోల్ఫ్ క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. ఇక ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 42కు చేరింది. ఇందులో 11 స్వర్ణాలు, 16 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క షూటింగ్‌లోనే 21 పతకాలు లభించడం విశేషం.

  • 🥈 Bang On Target! 🎯

    Our Women's Trap Shooting Team:
    🌟 #KheloIndiaAthletes Manisha Keer and Preeti Rajak
    🌟 @RiaKumari7

    Aimed high and hit the mark, securing the SILVER🥈 medal for India! 🇮🇳

    Let's cheer out loud for our sharpshooters for their incredible achievement! 🙌🥈… pic.twitter.com/Wvf1lV6vQp

    — SAI Media (@Media_SAI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు స్టార్‌ బాక్సర్ నిఖత్‌ జరీన్​ 50 కేజీల విభాగంలో ఆదివారం సాయంత్రం సెమీస్​లో తలపడనుంది. అలాగే బ్యాడ్మింటన్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనాతో పసిడి పతకం కోసం తలపడనుంది. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ ఫైనల్స్​కు చేరాడు. కైనాన్ చెనాయ్ ఆసియా క్రీడల్లో పురుషుల వ్యక్తిగత ట్రాప్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

టెన్నిస్​లోనూ భారత్ టాప్​..
Asian Games 2023 Tennis : శనివారం జరిగిన ఫైనల్స్​లో టెన్నిస్​ క్రీడాకారులు సంచలనం సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో పసిడి నిలబెట్టుకోలేకపోయిన వెటరన్‌ టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాత్రం పట్టు వదల్లేదు. తన కోప్లేయర్​ రుతుజ భోసాలేతో కలిసి బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ బోపన్న- రుతుజ జోడీ 2-6, 6-3, 10-4 తేడాతో తొమ్మిదో సీడ్‌ లియాంగ్‌- హువాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. 43 ఏళ్ల బోపన్న, 27 ఏళ్ల రుతుజకు తొలి సెట్లో చుక్కెదురైంది. కానీ రెండో సెట్లో బోపన్న ద్వయం అద్భుతంగా పుంజుకుంది. నిర్ణయాత్మక సూపర్‌ టైబ్రేక్‌లో బోపన్న జంట చెలరేగింది. ఈ క్రమంలో రుతుజ ఏస్‌తో మ్యాచ్‌ను ఓ కొలిక్కి తెచ్చింది. ఈ క్రమంలో టెన్నిస్‌లో భారత్‌కు ఓ పసిడి, రజతం (డబుల్స్‌లో సాకేత్‌-రామ్‌కుమార్‌) లభించాయి.

Asian Games 2023 Shooting : భారత షూటర్ల జోరు.. మరో రెండు గోల్డ్‌ మెడల్స్​

Asian Games Ind Vs Pak : ఉత్కంఠ పోరులో పాక్​పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం

Last Updated : Oct 1, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.