Asian Games Medals List : ఆసియా క్రీడల్లో పతాకల వేట కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఆర్చరీ మహిళా టీమ్ కాంపౌండ్ విభాగం భారత్‌కు మరో పసిడి దక్కింది. ఆర్చర్లు అదితి, జ్యోతి సురేఖ వెన్నమ్ పర్నీత్ కౌర్ రాణించి.. 230-228 స్కోర్‌లైన్‌తో చైనీస్ తైపీ జట్టును ఓడించారు. దీంతో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ ఖాతాలో మరో స్వర్ణం వచ్చింది. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీమ్‌లో కాంస్యం నెగ్గిన సురేఖ.. 2018లో రజతం గెలిచింది. ఇప్పుడు పసిడి సొంతం చేసుకుంది.
-
🎯🥇GOLDEN GIRLS🥇🎯#KheloIndiaAthletes Aditi, @VJSurekha, and @Parrneettt add another Gold to India's medal tally after defeating Chinese Taipei by a scoreline of 230-229🤩🎯
— SAI Media (@Media_SAI) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What a thrilling final 💪 Our Indian Archery contingent is truly shining bright, clinching their 2nd… pic.twitter.com/NtTiqO37aY
">🎯🥇GOLDEN GIRLS🥇🎯#KheloIndiaAthletes Aditi, @VJSurekha, and @Parrneettt add another Gold to India's medal tally after defeating Chinese Taipei by a scoreline of 230-229🤩🎯
— SAI Media (@Media_SAI) October 5, 2023
What a thrilling final 💪 Our Indian Archery contingent is truly shining bright, clinching their 2nd… pic.twitter.com/NtTiqO37aY🎯🥇GOLDEN GIRLS🥇🎯#KheloIndiaAthletes Aditi, @VJSurekha, and @Parrneettt add another Gold to India's medal tally after defeating Chinese Taipei by a scoreline of 230-229🤩🎯
— SAI Media (@Media_SAI) October 5, 2023
What a thrilling final 💪 Our Indian Archery contingent is truly shining bright, clinching their 2nd… pic.twitter.com/NtTiqO37aY
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లో ప్రముఖ స్క్వాష్ ద్వయం దీపికా పల్లికల్ల్, హరిందర్ పాల్ సింగ్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. తాజాగా జరిగిన ఫైనల్స్ ఈవెంట్లో మలేసియా జట్టుపై 2-0 పాయింట్ల తేడాతో పసిడిని ముద్దాడారు.
-
🥇𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐒𝐪𝐮𝐚𝐬𝐡 𝐑𝐞𝐢𝐠𝐧𝐬 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞!🌟
— SAI Media (@Media_SAI) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Our dynamic mixed doubles team of @DipikaPallikal and @sandhu_harinder clinches GOLD, defeating Malaysia by a score of 2-0 in the final at #AsianGames2022!💥🥳
Join us in celebrating this golden achievement and sending… pic.twitter.com/d1GiaRVh4q
">🥇𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐒𝐪𝐮𝐚𝐬𝐡 𝐑𝐞𝐢𝐠𝐧𝐬 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞!🌟
— SAI Media (@Media_SAI) October 5, 2023
Our dynamic mixed doubles team of @DipikaPallikal and @sandhu_harinder clinches GOLD, defeating Malaysia by a score of 2-0 in the final at #AsianGames2022!💥🥳
Join us in celebrating this golden achievement and sending… pic.twitter.com/d1GiaRVh4q🥇𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐒𝐪𝐮𝐚𝐬𝐡 𝐑𝐞𝐢𝐠𝐧𝐬 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞!🌟
— SAI Media (@Media_SAI) October 5, 2023
Our dynamic mixed doubles team of @DipikaPallikal and @sandhu_harinder clinches GOLD, defeating Malaysia by a score of 2-0 in the final at #AsianGames2022!💥🥳
Join us in celebrating this golden achievement and sending… pic.twitter.com/d1GiaRVh4q
మరోవైపు అందరి అంచనాలను నిజం చేస్తూ జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన కిశోర్ కుమార్ జెనా కెరీర్ బెస్ట్ నమోదు చేస్తూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. 86.77 మీటర్ల దూరం బల్లెం విసిరిన కిశోర్ చివరి వరకూ నీరజ్‌కు గట్టిపోటీనిచ్చాడు.
మహిళల 1500 మీటర్లలో రజతం గెలుచుకున్న హర్మిలన్ 800 మీటర్లలోనూ మరో రజతం సాధించింది. పురుషుల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. గ్రీకో-రోమన్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి.
అయితే బ్బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ రజతంతో సరిపెట్టుకుంది. లవ్లీనా ఓటమితో ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పోరాటం స్వర్ణ పతకం లేకుండానే ముగిసింది. ఇక భారత పురుషుల హాకీ జట్టు కూడా అదరగొట్టింది. సెమీఫైనల్లో దక్షిణకొరియాను 5-3 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.
Asian Games 2023 Tennis : ఇటీవలే జరిగిన ఫైనల్స్‌లో టెన్నిస్ క్రీడాకారులు సంచలనం సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో పసిడి నిలబెట్టుకోలేకపోయిన రోహన్ బోపన్న మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం పట్టు వదల్లేదు. తన కోప్లేయర్ రుతుజ భోసాలేతో కలిసి బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ బోపన్న- రుతుజ జోడీ 2-6, 6-3, 10-4 తేడాతో తొమ్మిదో సీడ్ లియాంగ్- హువాంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది.
Asian Games 2023 India Medals : భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. రజతం, కాంస్య పతకాలు కూడా
Neeraj Chopra Won Gold Medal : గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. సిల్వర్‌తో మెరిసిన కిషోర్ జెనా