ETV Bharat / sports

Asian Games 2023 India : ఆసియా క్రీడలు.. భారత్​కు 'బంగారు' పంట.. ఎవరెవరికి వచ్చాయంటే? - ఆసియా క్రీడల్లో ఇండియా వెండి పతకాలు

Asian Games 2023 India : ఆసియా క్రీడల్లో భారత్​ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. స్వర్ణ, రజత పతకాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. వారెవరంటే?

Asian Games Gold Medal 2023
Asian Games Gold Medal 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 9:22 AM IST

Updated : Sep 27, 2023, 2:15 PM IST

Asian Games 2023 India : ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్​లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఈశా సింగ్​లతో కూడిన టీమ్.. ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలుచుకుంది. 1759 పాయింట్లతో ఈ త్రయం తొలి స్థానాన్ని కైవసం చేసుకుని పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ గేమ్​లో ఆతిథ్య చైనా జట్టు 1756తో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, సౌత్​ కొరియా షూటర్లు1742 స్కోరు సాధించి మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నారు.

  • 🥈🇮🇳 Team India Shines Bright 🇮🇳🥈

    Incredible marksmanship on display! 🎯👏

    Congratulations to our phenomenal trio, @SiftSamra, Manini Kaushik, and Ashi Chouksey, on their stellar performance in the 50m Rifle 3 Positions Women's Team event! 🥈👩🎯

    Very well done, girls!!… pic.twitter.com/wTC9e3XwVz

    — SAI Media (@Media_SAI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సిఫ్ట్ సమ్రా కౌర్ ప్రపంచ రికార్డు..
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ సమ్రా కౌర్ (469.6 పాయింట్లు) ప్రపంచ రికార్డును నమోదు చేసి బంగారు పతకం సొంతం చేసుకుంది. చైనాకు చెందిన షూటర్ జంగ్‌ (462.3 పాయింట్లు) రజతం, భారత షూటర్ అషి చౌష్కీ (451.9 పాయింట్లు) కాంస్య పతకాలు సాధించారు.

  • GOLD WITH A WORLD RECORD🥇🎯@SiftSamra puts up an impressive performance in the 50-meter Rifle 3 Positions Individual event and takes home the prestigious GOLD🥇with a World Record🥳

    Superb feat from the 22-year-old 🇮🇳 Shooter🫡 who has taken the country's gold count to 5️⃣… pic.twitter.com/3S86sVTYRP

పురుషుల 50 మీటర్ల స్కీట్‌ షూటింగ్‌ విభాగంలోనూ భారత్ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. అంగద్ వీర్ సింగ్ బజ్వా, గుర్జోత్ ఖంగురా, అనంత్ జీత్ సింగ్ నరుకలతో కూడిన భారత జట్టు మూడో స్థానాన్ని సరిపెట్టుకుంది. పురుషుల డింగీ ILCA7 ఈవెంట్‌లో భారత ఆటగాడు విష్ణు శర్వణన్ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకాన్ని గెలుచుకుంది. పురుషుల స్కీట్ షూటింగ్‌లో భారత్‌కు చెందిన అనంత్‌జీత్ సింగ్ నరుకా రజతం సాధించాడు.

మరోవైపు మహిళల 50మీ 3 పొజిషన్ ఈవెంట్‌లో భారత జట్టు రజతాన్ని సాధించింది. ఈ జట్టులో మణిని కౌశిక్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సే సత్తా చాటారు. మొత్తం 1764 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈ ఈవెంట్​లో ఆతిథ్య దేశం చైనా 1773 స్కోరుతో స్వర్ణం గెలుచుకోగా.. సౌత్​కొరియా​ 1756 పాయింట్లతో కాంస్య పతకం అందుకుంది. వ్యక్తిగత ఈవెంట్‌లో కౌశిక్ 18వ స్థానంలో నిలవగా, సమ్రా స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇక చౌక్సే కాంస్య పతకాన్ని అందుకుంది.

Asian Games 2023 : చరిత్ర సృష్టించిన భారత్​.. 41 ఏళ్ల తర్వాత ఆ విభాగంలో తొలిసారి గోల్డ్​ మెడల్​

Asian Games 2023 : భారత్‌కు తొలి స్వర్ణం.. వరల్డ్ రికార్డ్​

Last Updated : Sep 27, 2023, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.