Asian Games 2023 Medal List : ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్లలో మన అథ్లెట్లు మెరుస్తున్నారు. ఇప్పటికే భారత్ ఖాతాలోకి బంగారం, వెండి, కాంస్య పతకాలను ఇచ్చిన ప్లేయర్లు.. తాజాగా ఈక్వెస్ట్రియన్ నుంచి భారత్‌కు మరో పతకాన్ని అందించారు. వ్యక్తిగత డ్రెస్సేజ్ విభాగంలో అనుష్ గార్వాలా కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ఈక్వెస్ట్రియన్‌లో భారత్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రెస్సేజ్ ఈవెంట్‌లో గెలిచి ఆ పతకాన్ని సొంతం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత డ్రెస్సేజ్ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.
-
Medal Alert🚨 in Equestrian🏇
— SAI Media (@Media_SAI) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Bronze🥉 it is for Anush Agarwalla in Individual Final Event, marking 🇮🇳's 1⃣st ever individual🎖️in Dressage
Well done & many congratulations on your🥉#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/P4Cf9G9KZK
">Medal Alert🚨 in Equestrian🏇
— SAI Media (@Media_SAI) September 28, 2023
Bronze🥉 it is for Anush Agarwalla in Individual Final Event, marking 🇮🇳's 1⃣st ever individual🎖️in Dressage
Well done & many congratulations on your🥉#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/P4Cf9G9KZKMedal Alert🚨 in Equestrian🏇
— SAI Media (@Media_SAI) September 28, 2023
Bronze🥉 it is for Anush Agarwalla in Individual Final Event, marking 🇮🇳's 1⃣st ever individual🎖️in Dressage
Well done & many congratulations on your🥉#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/P4Cf9G9KZK
అసలు ఈ డ్రెస్సేజ్ ఏంటి..
What Is Dressage In Equestrian : డ్రెస్సేజ్ అనే ఫ్రెంచ్ పదానికి ఇంగ్లిష్‌లో ట్రైనింగ్ అని అర్థం. ఇక ఈ ఈవెంట్‌లో రైడర్ తన గుర్రానికి ఏవిధమైన శిక్షణ ఇచ్చాడు.. గుర్రానికి తనకి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందన్న అంశాలను గమనిస్తారు. తాజాగా జరిగిన డ్రెసాజ్ ఈవెంట్ ఫైనల్స్‌లో అనుష్ సూచనల(మ్యూజిక్)కు తగినట్లుగా ఎట్రో పర్ఫెక్ట్ సింక్‌లో ప్రదర్శన ఇచ్చింది. దీంతో ఇంప్రెస్ అయిన న్యాయనిర్ణేతలు అనుష్, ఎట్రోల మధ్య సమన్వయం చక్కగా ఉండటం వల్ల ఈ ద్వయానికి పతకాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో 73.030 స్కోరు చేసిన అనుష్ అగర్వాలాకు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్‌లో మలేసియాకు చెందిన బిన్ మహ్మద్ పసిడిని ముద్దాడగా.. హాంకాంగ్ ప్లేయర్ జాక్వెలిన్ వింగ్ యింగ్ రజతాన్ని అందుకుంది.
ఫైనల్స్‌కు ఎంట్రీ ఇచ్చిన సాకేత్ జోడీ
Asian Games Tennis India : మరోవైపు టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాకేత్ మైనేని- రామ్‌కుమార్ రామనాథన్ స్వర్ణ పతకానికి అడుగు దూరంలో నిలిచింది. సెమీ ఫైనల్స్‌లో కొరియా జోడీ సోనోన్‌వూ క్వాన్, సియోంచన్‌పై 6-1, 6-7, 10-0 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇక రోహన్ బోపన్న- రుతుజా భోసలే జోడీ కూడా మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్‌లో క్వాలిఫై అయ్యి సెమీస్‌కు చేరుకున్నారు. ఇక స్క్వాష్‌లోనూ పురుషుల జట్టు సెమీస్‌కు చేరుకున్నారు.
-
Another victory✌🏻for the 🇮🇳 Tennis🎾 Contingent at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Seasoned Tennis player @rohanbopanna & Rutuja Bhosale are quite unstoppable as they clinched a victory in the quarter-finals, defeating 🇰🇿's Zhibek Kulambayeva and Grigoriy Lomakin 7-5, 6-3
Next stop 🛑: Semi… pic.twitter.com/WfrYjsYLwF
">Another victory✌🏻for the 🇮🇳 Tennis🎾 Contingent at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 28, 2023
Seasoned Tennis player @rohanbopanna & Rutuja Bhosale are quite unstoppable as they clinched a victory in the quarter-finals, defeating 🇰🇿's Zhibek Kulambayeva and Grigoriy Lomakin 7-5, 6-3
Next stop 🛑: Semi… pic.twitter.com/WfrYjsYLwFAnother victory✌🏻for the 🇮🇳 Tennis🎾 Contingent at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 28, 2023
Seasoned Tennis player @rohanbopanna & Rutuja Bhosale are quite unstoppable as they clinched a victory in the quarter-finals, defeating 🇰🇿's Zhibek Kulambayeva and Grigoriy Lomakin 7-5, 6-3
Next stop 🛑: Semi… pic.twitter.com/WfrYjsYLwF
-
Yet another showdown by @ramkumar1994 & @SakethMyneni at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The dynamic duo now is in the FINAL 🥳 after defeating Korea's Soonwoo Kwon & Seongchan Hong 6-1, 5-7, 10-0
Silver or Gold assured 💪🏻 Go for 🥇
All the very best for the final 🥳#Cheer4India#HallaBol… pic.twitter.com/WezZTnIARt
">Yet another showdown by @ramkumar1994 & @SakethMyneni at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 28, 2023
The dynamic duo now is in the FINAL 🥳 after defeating Korea's Soonwoo Kwon & Seongchan Hong 6-1, 5-7, 10-0
Silver or Gold assured 💪🏻 Go for 🥇
All the very best for the final 🥳#Cheer4India#HallaBol… pic.twitter.com/WezZTnIARtYet another showdown by @ramkumar1994 & @SakethMyneni at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 28, 2023
The dynamic duo now is in the FINAL 🥳 after defeating Korea's Soonwoo Kwon & Seongchan Hong 6-1, 5-7, 10-0
Silver or Gold assured 💪🏻 Go for 🥇
All the very best for the final 🥳#Cheer4India#HallaBol… pic.twitter.com/WezZTnIARt
చైనాకు చేరుకున్న టీమ్ఇండియా..
Team India For Asian Games :ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా చైనాకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆసియా గేమ్స్‌లో భారత్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. అలా నేరుగా క్వార్టర్స్ ఫైనల్స్ నుంచి మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం మీద మూడు మ్యాచ్‌లు విజయం సాధిస్తే భారత్ స్వర్ణ పతకం సాధిస్తుంది. అక్టోబర్ 3న భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా.. అక్టోబర్ 7న ఫైనల్స్ జరగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్లలో టీమ్‌ఇండియానే బలంగా కనిపిస్తుండటం వల్ల కచ్చితంగా టీమ్ ఇండియా స్వర్ణం సాధించే అవకాశముంది.
ఆసియా క్రీడలకు భారత జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబె, తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, రింకు సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్.
స్టాండ్ బై ఆటగాళ్లు: యశ్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్, సాయి కిశోర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
Asian Games 2023 India : ఆసియా క్రీడలు.. భారత్‌కు 'బంగారు' పంట.. ఎవరెవరికి వచ్చాయంటే?
Asian Games 2023 India : భారత్ ఖాతాలో మరో 'పసిడి'.. మనోళ్ల పతకాల వేట కంటిన్యూ