Asian Games 2023 India Rank : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. 50 ఏళ్ల తర్వాత పతకాల్లో భారత్ మంచి ర్యాంకు సాధించింది. ఎనిమిది స్వర్ణాలు, 11 రజతాలు, 12 కాంస్యాలతో మొత్తం 31 మెడళ్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో షూటింగ్ విభాగంలో గణనీయంగా పతకాలు కైవసం చేసుకున్నారు భారత క్రీడాకారులు.
గడిచిన 50 ఏళ్లలో.. ఇండోనేసియాలోని జకార్తాలో 1962లో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్ మంచి ర్యాంకు సాధించింది. భారత్ 10 గోల్డ్, 13 రజతాలు, 10 కాంస్య పతకాలతో సహా మొత్తం 33 పతకాలు సాధించి మూజో స్థానంలో నిలిచింది. అంతకుముందు దిల్లీ వేదికగా జరిగిన 1951 ఆసియా క్రీడల్లో 15 స్వర్ణాలు, 16 రజతాలు, 20 కాంస్య పతకాలు సహా మొత్తం 51 పతకాలను కైవసం చేసుకుని రెండో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత 1954లో మనీలాలో జరిగిన ఎడిషన్‌లో మొత్తం 17 పాతకాలు సాధించి ఐదో ర్యాంక్‌లో, జపాన్‌లోని టోక్చోలో జరిగిన మరుసటి ఎడిషన్‌లో 13 మెడల్స్ కైవసం చేసుకుని ఏడో స్థానం దక్కించుకుంది.
సంవత్సరం | ఆతిథ్య దేశం | పతకాలు | ర్యాంక్ |
1962 | జకార్తా, ఇండోనేసియా | 33 | 3 |
1966 | బ్యాంకాంక్, థాయ్‌లాండ్ | 21 | 5 |
1970 | బ్యాంకాంక్, థాయ్‌లాండ్ | 25 | 5 |
1974 | తెహ్రాన్, ఇరాన్ | 28 | 7 |
1978 | బ్యాంకాంక్, థాయ్‌లాండ్ | 28 | 6 |
1982 | దిల్లీ, భారత్ | 54 | 5 |
1986 | సియోల్, సౌత్ కొరియా | 37 | 5 |
1990 | బీజింగ్, చైనా | 23 | 11 |
1994 | హిరోషిమా, జపాన్ | 23 | 8 |
1998 | బ్యాంకాంక్, థాయ్‌లాండ్ | 35 | 9 |
2002 | బుసాన్, సౌత్ కొరియా | 36 | 7 |
2006 | దోహా, ఖతార్ | 53 | 8 |
2010 | గ్వాంగ్జౌ, చైనా | 65 | 6 |
2014 | ఇంచియాన్, దక్షిణకొరియా | 57 | 8 |
2018 | జకార్తా, ఇండోనేసియా | 70 | 8 |
2023 | హాంగ్జౌ, చైనా (ప్రస్తుతం) | 31 | 4 |
Asian Games Opening Ceremony 2023 : చైనాలో ఆసియా క్రీడలు సెప్టంబర్ 23న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతర దేశాల ప్రతినిధులతోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అథ్లెట్ల కవాతులో భారత క్రీడాకారుల బృందానికి.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో భారత ప్లేయర్లంతా.. ఖాకీ రంగు గల సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. భారత మహిళలు ఖాకీరంగు చీర, పురుషులు ఖాకీరంగు కుర్తాలో వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ దుస్తులను రూపొందించింది.
Asian Games 2023 India : ఆసియా క్రీడలు.. భారత్‌కు 'బంగారు' పంట.. ఎవరెవరికి వచ్చాయంటే?
Asian Games 2023 India Rank : ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న భారత్.. 50 ఏళ్ల తర్వాత బెస్ట్ ర్యాంక్!