ETV Bharat / sports

'ఆసియా గేమ్స్-2022'​ వాయిదా.. చైనానే కారణం! - చైనాలో కరోనా

Asian Games postponed: ఈ ఏడాది సెప్టెంబర్​లో జరగాల్సిన ఆసియా గేమ్స్​ వాయిదా పడ్డాయి. చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఆసియా ఒలింపిక్​ కౌన్సిల్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.

Asian Games postponed
'ఆసియా గేమ్స్-2022'​ వాయిదా
author img

By

Published : May 6, 2022, 1:19 PM IST

Updated : May 6, 2022, 2:03 PM IST

Asian Games postponed: చైనాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఆసియా గేమ్స్​పై పడింది. హంగ్జౌ నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్​లో నిర్వహించాల్సిన ఆసియా గేమ్స్​-2022 వాయిదా పడ్డాయి. కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న కారణంగా 19వ ఎడిషన్​ ఆసియా గేమ్స్​ను ఆసియా ఒలింపిక్​ కౌన్సిల్​ వాయిదా వేసినట్లు చైనా అధికారిక మీడియా సీజీటీవీ తెలిపింది.

asian games 2022 postponed
ఆసియా గేమ్స్-2022

ఒలింపిక్స్​ తర్వాత ఆసియా గేమ్స్​ రెండో అతిపెద్ద క్రీడా ఈవెంట్​. ఝెజియాంగ్​ ప్రావిన్స్​ రాజధాని హంగ్జౌ నగరంలో సెప్టెంబర్​ 10-25 మధ్య ఈ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే, చైనాలో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీరో కొవిడ్​ లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితాన్నివ్వటం లేదు. హంగ్జౌకు సమీపంలోని షాంఘైలో రోజువారీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆసియా గేమ్స్​పైన ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఆ ఒలింపిక్స్​లో తెలుగోడి సత్తా... స్వర్ణం గెలిచిన షూటర్

పారాలింపిక్స్​లో భారత తొలి స్వర్ణం వెనుక అంత కథ ఉందా!

Last Updated : May 6, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.