Asian Champions Trophy 2023 : ఆసియా ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో భారత హాకీ టీమ్ నాలుగోసారి విజేతగా నిలిచింది. చెన్నై వేదికగా శనివారం మలేసియాతో జరిగిన ఫైనల్స్‌లో భారత్ 4 - 3 తేడాతో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన భారత ఆటగాళ్లపై ప్రశంసల జల్లుతో పాటు కానుకల వర్షం కురుస్తోంది.
హాకీ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ టిర్కే.. భారత జట్టు ఆటగాళ్లతో పాటు, సిబ్బందికి కూడా నజరానా ప్రకటించారు. ప్రతి ప్లేయర్‌కు రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసియా ఛాంపియన్షిప్స్ 2023 హాకీ విభాగంలో విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు రూ 1.1 కోట్ల నజరానాను ప్రకటించారు. మరోవైపు ఈ టోర్నమెంట్లో పలువురు టీమ్ మెంబర్స్ పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్నారు.. అవేంటంటే..
-
Asian Champions 👑 #TeamINDIA 🇮🇳
— All India Radio News (@airnewsalerts) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India beat Malaysia by 4-3 in Final; Lift the Asian Champions Trophy #HockeyIndia | #IndiaKaGame | #HACT2023 | #AsianChampionsTrophy pic.twitter.com/gvatahL8r2
">Asian Champions 👑 #TeamINDIA 🇮🇳
— All India Radio News (@airnewsalerts) August 12, 2023
India beat Malaysia by 4-3 in Final; Lift the Asian Champions Trophy #HockeyIndia | #IndiaKaGame | #HACT2023 | #AsianChampionsTrophy pic.twitter.com/gvatahL8r2Asian Champions 👑 #TeamINDIA 🇮🇳
— All India Radio News (@airnewsalerts) August 12, 2023
India beat Malaysia by 4-3 in Final; Lift the Asian Champions Trophy #HockeyIndia | #IndiaKaGame | #HACT2023 | #AsianChampionsTrophy pic.twitter.com/gvatahL8r2
Asian Champions Trophy Awards : ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు : ఆరు మ్యాచ్‌ల్లో రెండు గోల్స్‌తో సత్తా చాటిన పాకిస్థాన్ ఆటగాడు అబ్దుల్ షాహిద్ 'ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు' దక్కించుకున్నాడు.
బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్ : సౌత్ కొరియా ఆటగాడు కిమ్ జేహియోన్ 'బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీలో సౌత్ కొరియా టీమ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ : ఏడు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్‌చేసి.. ప్రత్యర్థులను కట్టడి చేసిన భారత ఆల్‌రౌండర్ మన్‌దీప్ సింగ్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు వరించింది.
ఫ్యాన్ ఛాయిస్ అవార్డు ఫర్ బెస్ట్ గోల్ : గ్రౌండ్లో చురుగ్గా ఉంటూ.. చాకచక్యంతో ప్రత్యర్థులను ఏమార్చి గోల్స్ చేసే వారికి ఈ అవార్డు ఇస్తారు. ఇలా భారత ఆటగాడు సెల్వం కార్తి తన సొంత మైదానంలోనే బెస్ట్ గోల్ కొట్టి ఈ అవార్డును అందుకున్నాడు.
అత్యుత్తమ రైజింగ్ గోల్‌కీపర్ అవార్డు: జపాన్ గోల్‌కీపర్ టకుమి కిటగావా ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. గోల్‌పోస్టు వద్ద ప్రత్యర్థులను నిలువరించడంలో సఫలమైన ఈ స్టార్ ప్లేయర్.. జపాన్ మూడో స్థానంతో టోర్నీని ముగించే విషయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడికి 'బెస్ట్ రైజింగ్ గోల్‌కీపర్' అవార్డు దక్కింది.
అత్యధిక టీమ్ గోల్స్ అవార్డు: ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భారత టీమ్ మొత్తం 29 గోల్స్ సాధించింది. ప్రత్యర్థులపై దూకుడుగా ఆడి చిత్తు చేస్తూనే భారీగా గోల్స్ చేయడం విశేషం.
టాప్ స్కోరర్ ఇన్ ది టోర్నమెంట్: భారత్ నాలుగోసారి ఛాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 9 గోల్స్ చేసిన హర్మన్‌నే 'టాప్ స్కోరర్' అవార్డు వరించింది.
-
'Vande Mataram' during the Asian Champions Trophy Final.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What a moment! pic.twitter.com/FBI3Y88CHK
">'Vande Mataram' during the Asian Champions Trophy Final.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2023
What a moment! pic.twitter.com/FBI3Y88CHK'Vande Mataram' during the Asian Champions Trophy Final.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2023
What a moment! pic.twitter.com/FBI3Y88CHK
Ind Vs Pak Hockey 2023 : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్‌పై భారత్ ఘన విజయం..
నాలుగోసారి ఆసియాకప్ ఛాంపియన్‌గా భారత్.. ఫైనల్లో పాక్ చిత్తు