ETV Bharat / sports

భారత మహిళా అథ్లెట్​పై నాలుగేళ్ల నిషేధం - Gomathi Marimuthu banned

డోపింగ్​లో పట్టుబడిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మరిముత్తు నాలుగేళ్ల నిషేధానికి గురైంది. దీంతో 2023 మే వరకు పోటీల్లో పాల్గొనకుండా ఈమెపై అనర్హత వేటు వేశారు.

gomati
గోమతి
author img

By

Published : Jun 13, 2020, 12:59 PM IST

గతేడాది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెల్చుకున్న భారత రన్నర్‌ ​ గోమతి మరిముత్తుపై నాలుగేళ్ల నిషేధం విధించింది అథ్లెట్​ ఇంటిగ్రిటీ యూనిట్​. నిషేధిత ఉత్ప్రేరకం వాడి డోపింగ్‌ పరీక్షలో పట్టుబడిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

డోపింగ్‌లో శాంపిల్‌-ఏ పాజిటివ్‌గా తేలడం వల్ల గోమతిపై గతేడాది మేలో తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు శాంపిల్‌-బీ పరీక్షల్లోనూ ఆమె పాజిటివ్‌ అని తేలింది. దీంతో 2023 మే వరకు మరే ఇతర పరుగు పోటీల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

గతేడాది ఆసియా ఛాంపియన్​షిప్​లో 800 మీటర్ల పరుగు విభాగంలో పాల్గొని లక్ష్యాన్ని 2.70 నిమిషాల్లో ముగించింది బంగారు పతకం సాధించింది గోమతి. చైనాకు చెందిన వాంగ్​ చున్యు, కజికిస్థాన్‌కు చెందిన మార్గరిటా ముకషేవ్​ వంటి ఉత్తమ అథ్లెట్స్​ను ఓడించింది.

2019 మార్చి 18 నుంచి మే 17 వరకు గోమతి పాల్గొన్న పోటీల ఫలితాలు అన్నింటిని రద్దు చేశారు. ఈమె సాధించిన పతకాలు, టైటిల్స్, ర్యాంకింగ్ పాయింట్లు, నగదు బహుమతులను త్వరలో జప్తు చేయనుంది ఏఐయూ.

gomati
గోమతి

ఇది చూడండి : టెస్టు​ జట్టులోకి స్టార్ బౌలర్ రీఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.